ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత తరువాత మరింత ఉద్రిక్తంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను రెట్టింపు చేస్తూ 'కొత్త దశ యుద్ధం' ప్రారంభమైందని ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
'రెట్టింపు దాడులు' - ఇరాన్ హెచ్చరిక
మరోవైపు ఇప్పటికే ద్వంద్వ ప్రయోగ క్షిపణి (Dual-launch) వ్యూహాన్ని ఇరాన్ వివరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఏరోస్పేస్ దళాల కమాండర్ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజీద్ మౌసావి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘యుద్ధం కొత్త దశ ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు. ఇరాన్, ఖైబర్ షెకాన్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణితో పాటు ఫతా( (Fattah)-110, ఫతే-313 ,ఫతా వంటి కొత్త హైపర్‌సోనిక్ వేరియంట్‌లతో సహా ఫతా శ్రేణికి చెందిన వ్యవస్థలను ఉపయోగించి, గత దాడులన్నీ రెండింతలు ఎక్కువవుతాయని హెచ్చరించారు.
ఖార్గ్ ద్వీపంపై జరిగిన దాడుల నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాలకు దీర్ఘకాలిక అంతరాయం కలుగుతుందని గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో, ద్వంద్వ ప్రయోగ క్షిపణి వ్యూహాన్ని ఐఆర్‌జీసీ కమాండర్ వివరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇరాన్ తన క్షిపణి కార్యకలాపాలను పెంచుతోంది అంటూ ఒక ఐఆర్‌జీసీ కమాండర్ నుండి వచ్చిన మొదటి అధికారిక ప్రకటన ఇది కావడం గమనార్హం.
🇮🇷 Commander of Iran’s IRGC Aerospace Force, Brig. Gen. Seyed Majid Mousavi, posted a video stating:
“New phase of the war begins. With newly deployed dual-launch Fateh and Kheibar Shekan missile systems, all previous strikes are multiplied by two.” pic.twitter.com/RpTTkDZqd4— Malcolm X (@malcolmx653459) April 7, 2026
దీంతో పాటు, మంచి పొరుగు సంబంధాలు, ఆత్మసంయమనం ముగిశాయి అంటూ పర్షియన్ గల్ఫ్‌లోని దేశాలకు ఐఆర్‌జిసి మరో హెచ్చరిక జారీ చేసింది. ఫతే శ్రేణిలో సాధారణంగా 200 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్లకు పైగా పరిధి గల స్వల్ప నుండి మధ్యశ్రేణి క్షిపణులు ఉంటాయి. ఫతా వంటి హైపర్‌సోనిక్ రకాలు మాక్ 15 వరకు వేగాన్ని అందుకోగలవని ఇరాన్ పేర్కొంది.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేకపోతే వంతెనలు, ఇంధన కేంద్రాలతో సహా మౌలిక సదుపాయాలపై దాడులు ఎదుర్కోవలసి వస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువుకు కొన్ని గంటల ముందు ఈ దాడులకు ప్లాన్ జరిగినట్లు సమాచారం. ఇటీవలి రోజుల్లో, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని, జలసంధిని తిరిగి తెరవడానికి అవసరమైన షరతులు ఇంకా పరిష్కారం కాలేదని ఇరాన్ అధికారులు, ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన గడువు (మంగళవారం రాత్రి 8 గంటలే) ముగియకముందే సంచలన హెచ్చరికలు చేశారు. ఇరాన్‌లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుతుందని అనుకుంటున్నా. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కాగా డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు (హోర్ముజ్ జలసంధిని తెరవాలని) ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ దాడులు జరగడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ వద్ద ఉన్న ఫతా వంటి హైపర్ సోనిక్ క్షిపణులు మ్యాక్ 15 (Mach 15) వేగంతో ప్రయాణించగలవని, వీటిని అడ్డుకోవడం ప్రస్తుత రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితి మరింత విషమించేలా కనిపిస్తోంది. మొత్తానికి, ట్రంప్ వ్యూహం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడమా లేక సైనిక చర్యకు పునాది వేయడమా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం రాత్రి 8 గంటల గడువు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇదీ చదవండి: దుబాయ్‌లో ఖరీదైన బంగ్లాలు, కార్లు : షాకింగ్ బిలియనీర్ స్టోరీ


