భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌! | Vaibhav Sooryavanshi, Ayush Mhatre Miss Out From Indian Squad | Sakshi
Sakshi News home page

భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌!

Apr 7 2026 7:30 PM | Updated on Apr 7 2026 8:09 PM

Vaibhav Sooryavanshi, Ayush Mhatre Miss Out From Indian Squad

ఐపీఎల్‌-2026 సీజ‌న్ త‌ర్వాత భార‌త అండ‌ర్‌-19, అండ‌ర్‌-25జ‌ట్లు రెడ్ బాల్ సిరీస్‌ల కోసం శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. యువ ఆట‌గాళ్ల‌లలో రెడ్ బాల్ స్కిల్స్‌ను వెలికితీసేందుకు బెంగ‌ళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఒక ప్ర‌త్యేక ట్రైనింగ్ క్యాంప్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది.

ఈ అండర్-25 హై-పెర్ఫార్మెన్స్ క్యాంప్ కోసం 25 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. అయితే ఈ లిస్ట్‌లో యువ ఆట‌గాళ్లు వైభ‌వ్ సూర్య‌వంశీ, అయూశ్ మాత్రేల‌కు చోటు ద‌క్క‌లేదు. వీరిద్ద‌రూ ఐపీఎల్‌-2026లో బీజీగా ఉండ‌డంతో బోర్డు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. కానీ ప్ర‌ధాన జ‌ట్టులో మాత్రం వారు చోటు ద‌క్కించుకునే అవ‌కాశ‌ముంది.

కాగా శ్రీలంక టూర్ కంటే ముందు బీసీసీఐ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్‌లో నాలుగు రోజుల రెడ్-బాల్ మ్యాచ్‌ల సిరీస్ జ‌ర‌గ‌నుంది. దేశ‌వ్యాప్తంగా  64 మంది యువ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. వీరిని 4 జట్లుగా విభ‌జిస్తారు. ఒక్కో జ‌ట్టులో 16 మంది ఉంటారు.

ఇందుకోసం సీకే నాయుడు ట్రోఫీ, అండర్-23 వన్డే టోర్నీల్లో రాణించిన 25 మందిని, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో స‌త్తాచాటిన 25 మందిని ఎంపిక‌చేశారు. మిగిలిన 14 మందిలో అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్, ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.

ఈ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్‌లో రాణించిన వారికి 'ఇండియా ఎమర్జింగ్'(అండర్‌-25) ప్రధాన జ‌ట్టులో చోటు ద‌క్క‌నుంది. ఈ జ‌ట్టు శ్రీలంకలో పర్యటించి రెడ్-బాల్ మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం ఈ క్యాంప్ మొత్తం దిగ్గ‌జ క్రికెట‌ర్‌, బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ పర్య‌వేక్ష‌ణ‌లో జ‌ర‌గ‌నుంది.

బీసీసీఐ అండర్-25 షార్ట్‌లిస్ట్ ప్లేయర్స్ వీరే:
ఆయుష్ దోసేజా, యష్ ధుల్, మయాంక్ వర్మ, ఆయుష్ పాండే, శాశ్వత్ రావత్, మహేష్ పిథియా, రాజ్ లింబాని, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, అకిబ్ ఖాన్, కార్తీక్ యాదవ్, విద్యాధర్ పాటిల్, కె. హిమతేజ, భువనగిరి పున్నయ్య, పుఖ్రాజ్ మాన్, యశ్వర్ధన్ దలాల్, పార్థ్ వత్స్, ఈడెన్ ఆపిల్ టామ్, హిమాన్షు సింగ్, అమన్ మోఖాడే.
చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌ అరెస్టు

Advertisement
 
Advertisement
Advertisement