త్వరలో 14 వేల మందిపై వేటు? అమెజాన్‌ స్పందన ఇదే! | Amazon responds after reports claim it may lay off 14 000 employees next month | Sakshi
Sakshi News home page

త్వరలో 14 వేల మందిపై వేటు? అమెజాన్‌ స్పందన ఇదే!

Apr 8 2026 5:28 PM | Updated on Apr 8 2026 6:33 PM

Amazon responds after reports claim it may lay off 14 000 employees next month

అమెరికన్ దిగ్గజం, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో భారీ విడత ఉద్యోగ కోతలకు ప్రణాళిక రచిస్తున్నట్లువార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాలలో 14 వేల మందిని ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందా? ఈ ఏడాది జనవరిలో 16 వేల మందికి ఉద్వాసన పలకడం, ఇటీవల ఒరాకిల్‌  ప్రపంచవ్యాప్తంగా 30వేలమందిని తొలగించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల్లో భారీ ఆందోళన నెలకొంది.  దీనిపై  అమెజాన్‌ ఎలా స్పందించింది?

అమెజాన్ వచ్చే మే నెలలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులను తొలగించనుందన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అమెజాన్ 2026 మే నాటికి ప్రపంచ వ్యాప్తంగా 14వేల మందినితొలగించాలని యోచిస్తున్నట్లు బిజినెస్ అవుట్‌లుక్ తెలిపింది. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, మానవ వనరుల వంటి విభాగాలలో మధ్య-స్థాయి మేనేజర్లు,వైట్-కాలర్ ఉద్యోగులతో సహా కార్పొరేట్ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని  అంచనా వేసింది. 

ఇదీ చదవండి: కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్‌ చంద్రశేఖర్‌!

అమెజాన్‌ స్పందన
ఈ వార్తలపై అమెజాన్‌ స్పందించింది. ఇవన్నీ పుకార్లే నని కొట్టి పారేసింది.  ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ  ప్రచారం విశ్వసించవద్దని అమెజాన్ ప్రతినిధి కోరారు. 
ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

Advertisement
 
Advertisement
Advertisement