సీజ్‌ఫైర్‌ : పాక్‌ మార్కెట్లు ఫైర్‌, ట్రేడింగ్‌ నిలిపివేత! | Pakistan stocks surge over 12k points after US-Iran ceasefire trading halted | Sakshi
Sakshi News home page

సీజ్‌ఫైర్‌ : పాక్‌ మార్కెట్లు ఫైర్‌, ట్రేడింగ్‌ నిలిపివేత!

Apr 8 2026 4:01 PM | Updated on Apr 8 2026 5:07 PM

Pakistan stocks surge over 12k points after US-Iran ceasefire trading halted

అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గ్లోబల్‌ మార్కెట్లను భారీ ఊరట నిచ్చాయి. పెట్టుబడుదారుల సెంటిమెంట్‌ బలపడటంతో  దాదాపు అన్ని మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పేలవంగా ఉన్న పాకిస్తాన్‌ మార్కెట్లు భారీగా పుంజుకోవడం విశేషం. ఏప్రిల్ 8న ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో పాకిస్తాన్ బెంచ్‌మార్క్ స్టాక్ సూచీ 12,000 పాయింట్లకు పైగా పెరిగి, ఒకే రోజులో అత్యధిక ర్యాలీని నమోదు చేసింది. 

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని అస్థిరత కాలం తర్వాత ఈ భారీ ర్యాలీ చోటు చేసుకుంది. స్థానిక దినపత్రిక డాన్ ప్రకారం, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్  KSE-100 సూచీ  8.15 శాతం పెరిగి 164,035.83 పాయింట్లకు చేరుకుంది.  KSE-100 సూచీ చరిత్రలో ఒకే రోజులో నమోదైన అత్యధిక పెరుగుదల ఇదే. దీంతో  ఏరంగా ఎక్స్ఛేంజ్ నిబంధనలకు అనుగుణంగా ట్రేడింగ్‌ను నిలిపివేయడం విశేషం. రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైన తర్వాత ఈ లాభాలు నమోదయ్యాయి. 

ఈ ఒప్పందం ప్రకారం, ప్రపంచంలోని కీలక నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని టెహ్రాన్ తిరిగి తెరిస్తే, దానికి బదులుగా వాషింగ్టన్ సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించింది. రెండు వారాల పాటు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి టెహ్రాన్ అనుమతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ధృవీకరించారు.ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఒక "నిర్ణయాత్మక ఒప్పందం" కుదుర్చుకోవడమే ఈ చర్చల లక్ష్యమని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరగవచ్చని భావిస్తున్నారు.

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ఇదీ చదవండి: షార్ట్‌కట్‌ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి

కాగా  ఫిబ్రవరి 28న మొదలైన ఇరన్‌పై యుద్ధం ప్రారంభంలో కూడా ఎక్స్ఛేంజ్ భారీ నష్టాలను చవిచూసింది. ఆ తరువాత ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్‌ అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తల నేపథ్యంలో,మార్చి 2న KSE-100 సూచీ 16,089 పాయింట్లు లేదా 9.57 శాతం మేర పడిపోయి, ఒక్కరోజులో అత్యంత తీవ్రమైన క్షీణతను నమోదు చేసింది.

ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement