‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే.. | Vaginal Prolapse: Causes Symptoms Diagnosis | Sakshi
Sakshi News home page

‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..

Apr 8 2026 2:03 PM | Updated on Apr 8 2026 2:03 PM

Vaginal Prolapse: Causes Symptoms Diagnosis

మెనోపాజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా కనిపించే పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా కనిపించే ప్రోలాప్స్  సమస్యను చాలా మంది సహజంగా తీసుకుంటూ మౌనంగా భరిస్తుంటారు. కానీ ఈ సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా ఉపశమనం పొందవచ్చని కిమ్స్ కడల్స్ సికింద్రబాద్‌కు చెందిన కన్సల్టెంట్ యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ తెలిపారు. తాజాగా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మళ్లీ వచ్చిన వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్ కేసును విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.

65 ఏళ్ల మహిళకు గతంలో గర్భాశయ గడ్డల కారణంగా హిస్టరెక్టమీ చేయబడింది. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత యోనిలో బయటకు బల్జ్‌లా కనిపించడం ప్రారంభమై, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023లో ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, 2024లో మరోసారి మెష్‌తో అబ్డొమినల్ సర్జరీ చేశారు. అయినప్పటికీ నాలుగు నెలల్లోనే సమస్య మళ్లీ తలెత్తింది.

ఈ నేపథ్యంలో ఆమె మమల్ని సంప్రదించగా కేసును సమగ్రంగా పరిశీలించి, మొదట వజైనల్ పెస్సరీ ద్వారా కన్సర్వేటివ్ చికిత్సను సూచించగా, రోగి ఏడాది పాటు ఆ విధానాన్ని అనుసరించారు.తరువాత శాశ్వత పరిష్కారం కోసం రోగి ముందుకు రావడంతో వజైనల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాం. ఇందులో యాంటీరియర్ వజైనల్ వాల్ రిపేర్, యూటెరోసాక్రల్ లిగమెంట్ సస్పెన్షన్ ద్వారా బలమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు హై పెరినియోరాఫీ  కూడా చేశాం. ఈ శస్త్రచికిత్సతో రోగి త్వరగా కోలుకుని, సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం పొందింది.  

ఈ సందర్భంగా డా. బిందు ప్రియ మాట్లాడుతూ, ప్రతి రోగికి చికిత్సను వ్యక్తిగతంగా ప్రణాళిక చేయడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రోలాప్స్ తీవ్రత, గత శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని తెలిపారు. పెల్విక్ ప్రోలాప్స్, మూత్రం అదుపు లేకపోవడం వంటి సమస్యలు వయస్సు కారణంగా రావడం సహజమే అయినప్పటికీ, అవి తప్పనిసరిగా భరించాల్సినవికాదు. 

సిగ్గు, అపోహల కారణంగా ఆలస్యం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే జీవన నాణ్యత మెరుగుపడుతుందని సూచించారు. మహిళలు నిర్భయంగా తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేలా అవగాహన పెంపొందించడం సమాజ బాధ్యత అని డా. బిందు ప్రియ, డా. సాయి స్నేహిత పేర్కొన్నారు.
యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ, సికింద్రాబాద్‌

(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్‌ హ్యాబిట్స్‌)

Advertisement
 
Advertisement
Advertisement