క్షమించడంతోనే విముక్తి | Health Tips: Forgiveness: A Virtue That Frees the Heart | Sakshi
Sakshi News home page

క్షమించడంతోనే విముక్తి

Apr 8 2026 7:10 AM | Updated on Apr 8 2026 8:33 AM

Health Tips: Forgiveness: A Virtue That Frees the Heart

చాలామంది క్షమించడం అంటే ఎదుటివారు చేసిన తప్పును అంగీకరించడం లేదా వారిని మళ్ళీ దగ్గరకు తీయడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, క్షమించడం అనేది ఎదుటివారి కోసం చేసేది కాదు.. అది మీ కోసం మీరు చేసుకునే 'విముక్తి'. మీ వ్యక్తిత్వం నుండి పగ, ద్వేషం అనే భారాలను తొలగించి, మిమ్మల్ని మీరు ఎలా ఫ్రీ చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

మీకు అన్యాయం చేసిన వ్యక్తిపై కోపం పెంచుకోవడం అంటే, ఆ వ్యక్తికి మీ మనసులో 'ఉచితంగా రెంట్' (Free Rent) ఇచ్చినట్లే. మీరు పగతో రగిలిపోతున్నంత సేపు, మీ జీవితం ఆ వ్యక్తి నియంత్రణలో ఉంటుంది. క్షమించడం అంటే ఆ నియంత్రణను తెంచుకుని, మీ 'ప్రశాంతత'ను మీరు తిరిగి పొందడం.

పగ - ఒక మానసిక విషం (The Burden of Unforgiveness)
మనం ఎవరినైనా క్షమించలేనప్పుడు మన శరీరంలో నిరంతరంCortisol (స్ట్రెస్ హార్మోన్) విడుదలవుతుంది. ఇది మీ బీపీని పెంచుతుంది, నిద్రను పాడు చేస్తుంది ,  అది మీ సృజనాత్మకతను చంపేస్తుంది. కోపాన్ని మోయడం అంటే, ఎదుటివారి మీద విసరాలని మండుతున్న నిప్పు కణికను మీ చేతిలో పట్టుకోవడం లాంటిది. కాలేది మీ చేయి మాత్రమే, అవతలి వారికి ఏమీ కాదు.

క్షమించడం అంటే ఏమిటి? 
క్షమించడమంటే 'మర్చిపోవడం' కాదు.జరిగిన విషయాన్ని మీరు మర్చిపోలేరు, కానీ ఆ జ్ఞాపకం మిమ్మల్ని బాధించకుండా చూసుకోవచ్చు.

వారు చేసింది తప్పు అని మీకు తెలుసు, కానీ ఆ తప్పు వల్ల మీ వర్తమానం పాడవ్వకూడదు అని మీరు నిర్ణయించుకుంటారు.

క్షమించినంత మాత్రాన మీరు ఆ వ్యక్తితో మళ్ళీ స్నేహం చేయక్కర్లేదు. మీరు వారిని దూరం పెట్టవచ్చు, కానీ మనసులో కోపం లేకుండా.

మోటివేషన్ మాయ vs సైకాలజికల్ హీలింగ్
"మహాత్ముడిలా ఉండు, అందరినీ ప్రేమించు" అని మోటివేషన్ చెప్తుంది. ఇది ఒక్కోసారి ఆచరణలో కష్టం. కానీ సైకాలజీ... "నీ ఆరోగ్యం కోసం, నీ ఎదుగుదల కోసం ఆ విషాన్ని బయటకు కక్కేయ్" అని చెప్తుంది. క్షమించడం అనేది ఒక నైతిక బాధ్యత కంటే, ఒక 'సెల్ఫ్-కేర్' టెక్నిక్.

విముక్తి పొందే మార్గం
Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, క్షమాగుణాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి?

Step 1: Break Victim Identity...
"నాకు అన్యాయం జరిగింది, నేను బాధితుడిని" అనే ఆలోచనను 'Break' చేయండి. ఆ ఆలోచన మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఆ సంఘటన నుండి బయటకు వచ్చి, మీరు ఒక 'సర్వైవర్' (Survivor) అని గుర్తించండి.

Step 2: Build Emotional Detachment
ఆ వ్యక్తికి, మీ ఎమోషన్స్ కి మధ్య ఉన్న లింక్ ని 'Build' చేయండి. "వాడు ఇలా అన్నాడు కాబట్టి నేను బాధపడుతున్నాను" అనే వాక్యాన్ని "నేను నా పాత జ్ఞాపకం వల్ల బాధపడుతున్నాను, ఆ వ్యక్తికి ఇప్పుడు నా మీద అధికారం లేదు" అని మార్చుకోండి. మీ మనసును మీరు రీ-వైర్ చేసుకోండి.

Step 3: Liberation
క్షమించిన తర్వాత మీలో కలిగే ఆ తేలికపాటి భావనను అనుభవించండి. ఇప్పుడు మీ ఎనర్జీ పగ తీర్చుకోవడానికి కాకుండా, మీ 'లెగసీ'ని నిర్మించుకోవడానికి వాడుకోండి. ఇదే 'Beyond' స్టేజ్. ఒక వ్యక్తిని క్షమించిన రోజు మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు.

మీ మనసులో భారమెంత?
ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:
1.    మీరు ఇంకా ఎవరి మీదైనా కోపం పెంచుకున్నారా? ఆ కోపం వల్ల ఆ వ్యక్తికి ఏమైనా నష్టం జరుగుతోందా లేక మీకేనా?
2.    ఆ వ్యక్తిని క్షమిస్తే మీ జీవితంలో ఎంత సమయం, ఎంత ఎనర్జీ ఆదా అవుతుంది?
3.    మీరు మీ పాత గాయాలను మీ వ్యక్తిత్వానికి అలంకారాలుగా మార్చుకుంటారా లేక భారాలుగా మోస్తారా?

క్షమించడమే అసలైన వీరత్వం!
బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడం అనేది బలవంతుల లక్షణం. మీరు ఒకరిని క్షమించినప్పుడు, మీరు వారిని విడుదల చేయడం లేదు.. ఒక ఖైదీని విడుదల చేస్తున్నారు, ఆ ఖైదీ మరెవరో కాదు..మీరే!

"The weak can never forgive. Forgiveness is the attribute of the strong."
-    Mahatma Gandhi

 

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement