వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత | Health Tips: Aging gracefully: navigating the journey of growing older | Sakshi
Sakshi News home page

వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత

Apr 6 2026 3:33 PM | Updated on Apr 7 2026 9:31 AM

Health Tips: Aging gracefully: navigating the journey of growing older

చాలామంది వయసు పెరుగుతుంటే భయపడతారు, సౌందర్యం తగ్గుతుందని బాధపడతారు. కానీ సైకాలజీ ప్రకారం, వయసు పెరగడం అంటే కేవలం చర్మం ముడతలు పడటం కాదు, అది మీ'పరిపక్వత' (Maturity)శిఖరాగ్రానికి చేరడం.వయసుతో పాటు మీ వ్యక్తిత్వం ఎలా ఒక 'వటవృక్షం'లా మారాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

వయసు పెరగడం అనేది ఒక 'బయోలాజికల్ ప్రాసెస్' అయితే, పరిపక్వత చెందడం అనేది ఒక 'సైకలాజికల్ ఛాయిస్'. కొంతమంది 60 ఏళ్లొచ్చినా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు, మరికొంతమంది 30 ఏళ్లకే ఎంతో నిలకడగా ఉంటారు. "Aging Gracefully" అంటే వయసును దాచడం కాదు, ప్రతి ఏటా మీ అనుభవంతో మీ వ్యక్తిత్వానికి కొత్త గౌరవాన్ని అద్దుకోవడం.

ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం (Integrity vs Despair)
ప్రముఖ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం, వయసు పైబడినప్పుడు మనిషి మనసులో రెండు భావాలు ఉంటాయి:

Despair (నిరాశ): "నా జీవితం వృథా అయిపోయింది, నేను ఏమీ సాధించలేదు" అని బాధపడటం.
Integrity (పరిపూర్ణత): "నేను నా జీవితాన్ని అర్థవంతంగా గడిపాను, నా తప్పుల నుండి నేర్చుకున్నాను" అని తృప్తి చెందడం.
మీరు'Integrity'స్టేజ్ లో ఉండాలంటే, మీ గతాన్ని మీరు ప్రేమించాలి, మీ వర్తమానాన్ని గౌరవించాలి.

పరిపక్వత లక్షణాలు (Signs of Maturity)
వయసుతో పాటు మీ పర్సనాలిటీలో ఈ మార్పులు రావాలి:
Emotional Regulation:చిన్న చిన్న విషయాలకు ఆవేశపడటం తగ్గి, నిశ్శబ్దంగా గమనించే తత్వం పెరుగుతుంది.
Detachment (నిర్లిప్తత):ప్రతి విషయంలోనూ తలదూర్చకుండా, ఏది ముఖ్యం ఏది కాదు అనే విచక్షణ జ్ఞానం వస్తుంది.
Forgiveness:పాత పగలను, కోపాలను మోయడం ఆపేస్తారు. క్షమించడం అనేది ఎదుటివారి కోసం కాదు, మీ ప్రశాంతత కోసం అని అర్థం చేసుకుంటారు.

మోటివేషన్ మాయ vs గ్రేస్‌ఫుల్ ఏజింగ్
"ఎప్పుడూ యంగ్ గా కనిపించు, ముసలితనాన్ని దరిచేరనివ్వకు" అనిమోటివేషన్ మార్కెటింగ్ మాయలో పడేస్తుంది. ఇది మిమ్మల్ని మీ సహజత్వం నుండి దూరం చేస్తుంది. కానీ సైకాలజీ "నీ వయసును గౌరవించు. నీ ముడతలు నువ్వు గెలిచిన యుద్ధాలకు గుర్తులు. నీ జుట్టు రంగు నీ అనుభవానికి సాక్ష్యం" అని చెప్తుంది.

వయసుతో పాటు వన్నె తగ్గకుండా..
Genius Matrix Hubఫిలాసఫీ ప్రకారం, గ్రేస్‌ఫుల్ గా ఎదిగే మార్గం ఇది:
Step 1: యవ్వనం పట్ల వ్యామోహాన్ని వదిలేయండి
"నేను ముసలివాడిని అయిపోతున్నాను" అనే భయాన్ని 'Break' చేయండి. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. మీ మనసు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే (Lifelong Learning), మీరు ఎప్పటికీ యంగ్ గానే ఉంటారు. మీ ఆలోచనల్లోని ముసలితనాన్ని వదిలేయండి.

Step 2: Build Knowledge Sharing
మీరు ఇన్నాళ్లు సంపాదించిన అనుభవాన్ని 'Build' చేయండి. దాన్ని తర్వాతి తరానికి ఎలా అందించాలో ప్లాన్ చేయండి. మీ పిల్లలకు లేదా మీ శిష్యులకు మీరు ఒక 'రోల్ మోడల్'గా నిలవాలి. మీ పరిపక్వతే మీ చుట్టూ ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వాలి.

Step 3: Spiritual Maturity
శరీరం బలహీనపడుతున్నా, ఆత్మ బలంగా ఉండాలి. మరణాన్ని చూసి భయపడకుండా, ఒక అద్భుతమైన లెగసీని వదిలి వెళ్తున్నాననే తృప్తితో ఉండటమే 'Beyond' స్టేజ్. మీరు లేకపోయినా మీ సంస్కారం పదికాలాల పాటు ఉండాలి.

మీరు ఎలా ఎదుగుతున్నారు?
ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:
1.    గడిచిన పదేళ్లలో మీ ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు ఏంటి? మీరు ఇంకా పాత కోపాలను మోస్తున్నారా?
2.    మీ కంటే చిన్నవారు మీ దగ్గరకు సలహా కోసం వస్తున్నారా?
3.    మీరు వయసును చూసి భయపడుతున్నారా లేక గర్వపడుతున్నారా?

పాతబడే కొద్దీ విలువ పెరగాలి!
పాతబడే కొద్దీ విలువ తగ్గేది వస్తువులకి మాత్రమే, మనుషులకి కాదు. ఒక పాత పుస్తకం లేదా ఒక పాత వైన్ లాగా మీ విలువ కాలంతో పాటు పెరగాలి. మీ పరిపక్వతే మీ సౌందర్యం. మీ నవ్వులో ఉండే ఆ నిశ్శబ్ద సత్యమే మీ పర్సనాలిటీకి అసలైన లెగసీ.

"Grow old along with me! The best is yet to be."
•    Robert Browning

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement