ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..! | US Woman Discovers Stage Four Cancer After Car Crash | Sakshi
Sakshi News home page

ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!

Apr 7 2026 5:55 PM | Updated on Apr 7 2026 6:26 PM

US Woman Discovers Stage Four Cancer After Car Crash

ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు బాధనే కాదు త్రుటిలో పెను ప్రాణాంతక ప్రమాదాల నుంచి రక్షిస్తాయి కూడా. ఒక్కోసారి విత్కర పరిస్థితి కూడా వరంగా మారిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ మహిళ కథ. ఆ రోజు ఆమెకు ఆ యాక్సిడెంట్‌ జరగకపోతే..ప్రాణాలతో ఉండేది కాదు. ఇదేంటి అనుకోకండి ఈ కథ వింటే ఏం జరిగినా మన మంచికే అనే పెద్దల మాట తలపుకు వస్తుంది. 

అమెరికాలోని ఓవెన్స్‌ క్రాస్‌ రోడ్స్‌కు చెందిన 31 ఏళ్ల మెలిస్సా ఆడమ్స్‌ తన పెళ్లికి ఒక రోజు ముందు రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. రిహార్సల్‌ డిన్నర్‌ నుంచి ఇంటికి వస్తుండగా సిగ్నల్‌ వద్ద  ఉన్న ఆమె కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీ కొట్టారు. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్సి చేసే నిమిత్తం వైద్యులు సీటీ స్కాన్‌ చేయగా..ఆమె ప్రాణాంతక కేన్సర్‌ వాధి బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. అది నాలుగో స్టేజ్‌లో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. ఒక్క క్షణంలో జీవితం తలకిందులైనట్లు అనిపించిందామెకు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోకూడదని ఆమె, తన భాగస్వామి తీర్మానించుకున్నట్లు ఆడమ్స్‌ పేర్కొంది. ఈ దురదృష్టకర ఘటన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన రోజుని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఇలా చేసినట్లు తెలిపింది. 

తర్వాత వైద్యులు ఆమె శరీరంలోని మొత్తం 18 గడ్డలను గుర్తించి, ఆమెకు ఫోలిక్యులర్ డెండ్రిటిక్ సెల్ సార్కోమా (FDCS) అనే అత్యంత అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆ గడ్డలు ఆమె శరీరంలోని గుండె దగ్గర నుంచి పొత్తికడుపు, ఛాతీతో సహా పలుచోట్ల ఉన్నట్లు తెలిపారు. అనేక ఆస్పత్రులు, ఆంకాలజీ క్లినిక్‌లను సందర్శించిన తర్వాత చివరకు ఏప్రిల్ 1, బుధవారం నాడు చికిత్సను ప్రారంభించారు. సుమారు 19-20 వారాలు వేచి ఉన్న తర్వాత కీమోథెరపీని ప్రారంభించడంతో తనకు ఉపశమనం, ఆశ కలిగిందని అన్నారు. 

ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు కోసం గోఫండ్‌ సాయం తీసుకున్నట్లు తెలిపింది. నిజానికి తనకు అప్పటికే కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నాయని, నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మొదటి నుంచి ఆసమస్యలు ఉండటంతో అందువల్ల ఇలా అనుకున్నాననే గానీ ఇలా ప్రాణాంతక కేన్సర్‌ బారిన పడతానని ఊహించలేదని కన్నీటిపర్యంతమైంది. తాను గత కొంతకాలంగా శరీరం అంతా పలు నొప్పులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది. 

కణుతులు అవయవాలపై ఒత్తిడి తేవడం వల్లనేనని ఇప్పుడు అర్థమవుతోందని అంటోంది. వ్యాధి నిర్థారణ తర్వాత తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలంటూ ఇతరులకు సూచనలందిస్తోంది. అస్సలు తనకు గనుక ఆ కారు ప్రమాదం జరిగి ఉండకపోతే..తన అనారోగ్యాన్ని గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని అని అంటోందామె.

అలాగే తనలాంటి లక్షణాలు ఉన్నా లేక శరీరం ముందుగా ఇచ్చే సంకేతాలనుక్ క్షణ్ణంగా అర్థంచేసుకోమని సూచిస్తోంది. తనలా నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు పలుకుతోంది. ఇక ఆడమ్స్‌​ పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉందని, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. 

(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్‌ హ్యాబిట్స్‌)
 

Advertisement
 
Advertisement
Advertisement