ఆడపిల్ల అనే చిన్నచూపుతో ముద్దుల మూటగట్టే కవల పిల్లల్ని కన్నతండ్రే అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ప్రతీ ఒక్కరినీ కంట తడిపెట్టించింది. ఆధునిక సమాజంలో కూడా ఆడబిడ్డల్నిఒక భారంలా చూస్తున్న వైనం ఆందోళన రేపుతోంది. అయితే డెహ్రాడూన్‌లోని ఒక కుటుంబం తమ ఇంట ఆడబిడ్డ పుట్టిన క్షణాలను ఆనందంగా జరుపుకున్నారు. తద్వారా ఆడబిడ్డలు భారం కాదు, బలం ఆనందం, సంతోషం అనే శక్తివంతమైన సందేశాన్ని అందించారు.
కుటుంబంలోకి ఒక బిడ్డ రావడం సంతోషాన్నిచ్చే వార్తే. జెండర్‌తో సంబంధం లేకుండా కుటుంబమంతా ఆనందపడాల్సి క్షణాలు. డెహ్రాడూన్‌లోని కుటుంబం అదే చేసింది. కాదు కాదు మరింత ప్రత్యేకంగా తమ ఇంటి మహాలక్ష్మికి స్వాగతం పలికింది. బంధువులకు, స్నేహితులకు మామూలుగా ప్రకటించడం కాకుండా, అందరూ గుర్తుంచుకునే విధంగా పండగలాగా వేడుక చేశారు. ఆనందంతో కుమార్తెకు స్వాగతం పలకడమేకాదు యావత్ దేశం చూడగలిగే ఒక సందేశాన్ని ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి : గుండె పగిలింది : హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం
ట్రాఫిక్‌ను నిలిపివేసి మరీ వేడుక
ఆ కుటుంబం రెండు కార్లలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. గులాబీ రంగు బెలూన్‌లతో అందంగా అలంకరించి దానిపై ‘బేటీ హుయీ హై’ (ఆడబిడ్డ పుట్టింది) అని రాసి ఉన్న ఒక ప్లకార్డు ఉంచారు. ఆ కార్లను నగర వీధుల్లో ఊరేగించారు. ఇది అందర్నీ విపరీతంగా ఆకర్షించింది. ఎంతలా అంటే ట్రాఫిక్‌ను నిలిపివేసి మరీ ఆ కుటుంబం సంతోషంలో పాలు పంచుకున్నారు. వాహనదారులు తమ వాహనాలను ఆపివేసి మరీ ఈ వేడుకను తిలకించారు. ఈ వీడియోను నీరజ్ పాశ్వాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

A family in Dehradun celebrated their baby girl’s birth, driving around announcing “Beti Hui Hai,” spreading joy, breaking stereotypes, and inspiring others to proudly welcome daughters with love and pride.
🎥 Credits: @rjneeraj pic.twitter.com/jaLIsdEbcG— OneVision Media (@onevision_media) April 8, 2026
మరోవైపు ఈ కుటుంబ సభ్యులలో ఒకరైన తాన్యా సిన్హా కూడా దీని సంబరం వెనుక క్షణాలను పంచుకున్నారు. కారును ఎలా అలంకరించారో అలా చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆమె పంచుకున్నారు. వైరల్ అవుతుందని తాము ఇలా ప్లాన్ చేయలేదనీ, కేవలం తమ ఆనందాన్నిఇలా ప్రకటించుకున్నామని వివరించారు.
ఇదీ చదవండి: త్వరలో 14 వేల మందిపై వేటు? అమెజాన్ స్పందన ఇదే!


