గుండె పగిలింది : హీరోయిన్‌ ఇంట తీవ్ర విషాదం | Parveen Khan Zareen Khans mother dies Veer actress react My heart is broken | Sakshi
Sakshi News home page

గుండె పగిలింది : హీరోయిన్‌ ఇంట తీవ్ర విషాదం

Apr 8 2026 3:26 PM | Updated on Apr 8 2026 3:46 PM

Parveen Khan Zareen Khans mother dies Veer actress react My heart is broken

బాలీవుడ్ హీరోయిన్‌, జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు. దీంతో జరీన్ శోకసంద్రంలో మునిగిపోయింది.  సోషల్‌ మీడియా ద్వారా  పలువురు సెలబ్రిటీలు,సహనటులు ఆమెకు సానుభూతి ప్రకటించారు.

తన దుంఖాన్ని నటి సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.  ఇటీవలే పెంపుడు పిల్లి రాంబోను కోల్పోయిన జరీనా తల్లిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.  తరచు తన తల్లి  ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను  పంచుకుంటూ ఉంటుంది జరీనా. ముఖ్యంగా 2016లో పర్వీన్ ఖాన్‌కు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పర్వీన్ ఖాన్ కన్నుమూశారు.

"మా ప్రియ  పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్, సనా ఖాన్‌ల తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని జరీన్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని వెర్సోవాలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం పర్వీన్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  దీంతో ఈ విషాద సమయంలో ఆమెకు సానుభూతిని, అండను తెలియజేస్తూ సందేశాలు పంపుతున్నారు.

హిందీ మూవీ 'వీర్' ద్వారా సల్మాన్ ఖాన్ సరసన వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్‌ మరణం చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతికి గురిచేసింది.  టాలీవుడ్‌ యాక్షన్ థ్రిల్లర్  హీరో గోపీచంద్ సరసన చాణక్య మూవీలో కనిపించింది జరీన్ ఖాన్. అలాగే రామ్‌గోపాల్‌  దర్శకత్వంలో 'వీరప్పన్' చిత్రంలోనూ జరీన్  నటించింది. పంజాబీ, తమిళ భాషల్లోనూ తన ముద్ర వేసిన జరీన్  చివరి సినిమా 2020లో వచ్చిన 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే'.

ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

Advertisement
 
Advertisement
Advertisement