హైదరాబాద్ : రా స్ట్రెంగ్త్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 మరియు 5, 2026 తేదీల్లో మాదాపూర్ రెట్రో డ్రైవిన్ సమీపంలో ఘనంగా నిర్వహించిన “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” నగరంలోని కాలిస్థెనిక్స్ ఫిట్‌నెస్కు మైలురాయిగా నిలిచింది.
హైదరాబాద్‌లోనే అతిపెద్ద కాలిస్థెనిక్స్ పోటీ” గా పేరుగాంచిన ఈ ఈవెంట్, అథ్లెట్లు, ఫిట్‌నెస్ ప్రేమికులు మరియు ప్రేక్షకులను రెండు రోజులపాటు ఉత్సాహంతో ముంచెత్తింది, సుమారు 90 మంది పార్టిసిపెంట్లు 22 మంది ఫైనల్ లిస్టులు 8 నుంచి 10 రకాల క్యాటగిరిలో నిర్వహించారు.
₹3 లక్షల భారీ బహుమతి నిధితో నిర్వహించిన ఈ పోటీలో పాల్గొన్న వారు అద్భుతమైన శక్తి, సహనం, సమతుల్యత, చురుకుదనం ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ, “విరాట పర్వం” దర్శకుడు వేణు ఉదుగుల, మరియు సీనియర్ లీడర్, యువతకు మద్దతుదారుడు, ఈ కార్యక్రమానికి ముఖ్య ఆధారంగా నిలిచిన మాధాపూర్ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.


