ప్రజలకు నేనున్నాననే భరోసా ఇచ్చిన క్షణాలవి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Remembers YSR 2003 Historic Padayatra | Sakshi
Sakshi News home page

ప్రజలకు నేనున్నాననే భరోసా ఇచ్చిన క్షణాలవి: వైఎస్‌ జగన్‌

Apr 9 2026 7:30 AM | Updated on Apr 9 2026 10:12 AM

YS Jagan Remembers YSR 2003 Historic Padayatra

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రను గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర గతిని మార్చేసిన ఆ ఘట్టానికి నేటితో 23 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా.. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆ పాదయాత్ర.. చరిత్రనే తిరగరాసిందని జగన్‌ పేర్కొన్నారు.

2003 ఏప్రిల్‌ 9వ తేదీన ఎర్రటి ఎండలో వైఎస్సార్‌ మొదలుపెట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని.. “నేనున్నాననే భరోసా ఇచ్చింది” అని జగన్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆ పాదయాత్రకు మద్దతుగా నిలిచి వైఎస్సార్‌ను ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై తొలి సంతకం చేసిన వైఎస్సార్‌.. రైతులను రాజులుగా నిలిపారని, పేదలకు, బలహీన వర్గాలకు భరోసా ఇచ్చారని జగన్‌ గుర్తు చేశారు.

అలాగే, వైఎస్‌ చేపట్టిన సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని, పేద పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అయ్యేలా విద్యా అవకాశాలు కల్పించారన్నారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు పోలవరం పనులను వేగవంతం చేసిన వైఎస్సార్‌ ముద్రను ఎవరూ చెరిపేయలేరని జగన్‌ అన్నారు. తండ్రి పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. తన ప్రయాణం కొనసాగుతుందని జగన్‌ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: YSR Padayatra: మండిన ఎండ.. కరిగిన గుండె

Advertisement
 
Advertisement
Advertisement