
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తనపై దాడి జరగబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేయబోతున్నట్లు టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. ‘‘నన్ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. నాపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి. నాపై దాడి జరిగితే లోకేష్, బీటెక్ రవే బాధ్యత వహించాలి’’ అని సతీష్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘నాకు ఏమైనా జరిగితే సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదు. ఎందుకంటే పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు’’ అంటూ సతీష్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందులలో జరుగుతున్న వ్యవహారాలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి కల్గిస్తున్నాయి. పోలీస్, టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పెళ్లికి వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అది మరువక ముందే మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీ, వేల్పుల రాముపై హత్యాయత్నం చేశారు.
..దాడి చేసిన వారే వైఎస్సార్‌సీపీ నేతలపై ఎదురు కేసు పెట్టీ ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు. ఒక డీఐజీ స్థాయి అధికారి పత్తి వ్యాపారానికి వెళ్లారా అని మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడే తీరు చూస్తే మీకు కానిస్టేబుల్‌కి ఇచే గౌరవం కూడా ఇవ్వరు. పోలీసులు 100 మీటర్ల దూరంలో ఉండి కూడా మీ పోలీసులు రాలేదు. మీరు లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవి అంటున్నారా?. ఇంత పనికిమాలిన వ్యవస్థ అండ చూసుకుని టీడీపీ చెలరేగిపోతోంది. ఇప్పుడు సాక్షి వాహనాలను ధ్వంసం చేస్తామని బెదిరిస్తావా?. కొంత మంది వ్యక్తులు చేస్తున్న పైశాచికాన్ని మీ ప్రభుత్వం కాపాడుతున్నారు
..నాకు కూడా భద్రత లేదు.. అయినా ఎన్నికలను జరిపిస్తాం. ఒక వైపు వీళ్లే దాడి చేయడం, ఆ నెపం మాపై నెట్టడం వాళ్లకి రివాజుగా మారింది. నిన్న రాత్రి మా వాళ్లను కొంత మంది అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వాళ్లు ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లోనే ఉన్నారు. ఈ అరాచకాలు భరించలేక ఈ ఎన్నిక వదిలిపెడతాం అనుకుంటున్నారేమో.. మా మహిళలే ముందుండి ఎన్నికలు నడిపిస్తారు. చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటి..? మాకు హై కమాండ్ నుంచి ఆదేశాలు అని చెప్తున్నారు

..లోకేష్ ఎన్ని దౌర్జన్యాలు చేసైనా పులివెందుల గెలిచి తండ్రికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాడు. లోకేష్ మీరు అనుచితంగా మాట్లాడితే.. మేము అలానే మాట్లాడతాం. నేను మాట్లాడానని నాపై వేధింపులు చేస్తానంటే భయపడే వారు లేరు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాలు అన్నీ తీసుకెళ్లాం. మీకు ఎన్నిక నిర్వహించలేనప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం..?. ఒక గ్రామ ఓటర్లు వేరే గ్రామంలో ఓటు వేయాలా..?. ఈ అరాచకాలు ఆగేటట్లు లేవు...పులివెందుల ఆడబిడ్డలు ముందుండి నడపండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, లోకేష్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య పోరు. దాని కోసం అక్రమ మార్గాలు, దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్నారు
..ప్రజలు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, పిల్లలకు వస్తున్న కృష్ణా జలాలను చూడండి. స్వార్థంతో కొంతమంది చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిండి. ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందులకు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో గమనించండి. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 మెడికల్ సీట్లు వెనక్కి పంపిన వాళ్లు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ నాయకులు, వారికి మద్దతు పలికే నాయకులను ప్రశ్నిస్తున్నా.. మీరు పులివెందులకు ఏమి చేశారు..?.
అసలు మీరు ధైర్యంతో పులివెందుల ప్రజల ఓట్లు అడుగుతున్నారు?. ఏమి చూసి మీకు ప్రజలు ఓటు వేయాలి అని ప్రశ్నిస్తున్నా.. పైగా అరాచకాలు, మీడియా వాహనాలు పగలగొడతాం అంటున్నారు. ఒక పెద్ద మనిషిగా ఇవన్నీ ఆపాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయడం లేదు. చివరి అంకంలో చంద్రబాబు ఇలాంటివి అనుమతించి మరింత చెడ్డపేరు తెచ్చుకుంటారు. మీరు దాడులు, అక్రమాలు చేసి గెలిచినా అది గెలుపు కాదు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. డీఐజీ ఒక ఉన్నత అధికారిగా వ్యవహరించడం లేదు.’’ అంటూ సతీష్‌రెడ్డి మండిపడ్డారు.