
రాహుల్‌పై ఎన్నికల సంఘం తీరును తూర్పారబట్టిన మాజీ సీఈసీ ఖురేషి
న్యూఢిల్లీ: బిహార్‌లో ఆగమేఘాల మీద చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)పై లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా భావించి దర్యాప్తు చేపట్టాల్సిందిపోయి ఆయనపై ప్రత్యారోపణల బురద చల్లడం ఏమాత్రం సబబుకాదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషి వ్యాఖ్యానించారు.
ఖురేషి రాసిన ‘ప్రజాస్వామ్యానికి గుండెకాయ(డెమొక్రసీస్ హార్ట్‌ల్యాండ్’పుస్తకం త్వరలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నిల సంఘం తీరును ఆయన తూర్పారబట్టారు. ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన తర్వాత ఉద్యమస్థాయికి చేరిన విషయం తెల్సిందే. ‘‘ఓట్ల చోరీ అంశంలో త్వరలో రాహుల్‌గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’పేలుస్తానని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఎత్తుగడ అయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి.
ఎన్నికల సంఘం కొత్త ఓట్ల జోడింపు, నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, లోపాటు ఉన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ చాలా తీవ్రంగా భావించాలి. వాటిలోని సహేతుకత, ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేపట్టాలి. సమగ్రస్థాయిలో దర్యాప్తుతో ఆయన ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చాలి. అలాంటిదేమీ చేయకుండా కేవలం ఆయనపై ప్రత్యారోపణలు చేయడం ఈసీకి తగదు. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని విపక్షపారీ్టలుసహా పలు వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంది. ఆ దిశగా అడుగులేయాల్సిందిపోయి ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకుని వివాదాల తేనెతుట్టెను ఈసీ కదిపింది’’అని ఖురేషి అన్నారు.
అఫిడవిట్ అడగడం సబబుకాదు
‘‘ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించినప్పుడు దర్యాప్తు మొదలెడితే సరిపోయేది. అలా చేయకుండా రాహుల్ నుంచి ఆ ఆరోపణలు నిజమేనని పేర్కొంటూ అఫిడవిట్‌ను కోరడం సబబుకాదు. ఆయనేం వీధిలో వెళ్లే వ్యక్తికాదు. లోక్‌సభలో విపక్ష నేత. కోట్లాది ఓటర్లకు ప్రతినిధి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల తరఫున ప్రశ్నించే ప్రజాప్రతినిధి. కోట్లాది ప్రజల గొంతుక. అలాంటి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తితో ఈసీ ఇలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. అఫిడవిట్ ఇవ్వండి లేదంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఆయనతో అమర్యాద బాషలో సం¿ోదించడం అభ్యంతరకరం మాత్రమేకాదు నేరంకూడా’’అని ఖురేషి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ సందర్భాల్లో నేనెంతో బాధపడ్డా..
‘‘నేరుగా ఈసీని తప్పుబడుతూ ఏవైనా ఆరోపణలు వస్తే నేను తొలుత ఆందోళనచెందుతా. ఈసీని అత్యంత పారదర్శకంగా పనిచేసేలా చూడటంలో నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నా వంతు కృషిచేశా. అందుకే ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘంపై ఎవరైనా ఆరోపణలుచేస్తే మాజీ సీఈసీగానేకాకుండా ఒక సగటు భారతీయ పౌరునిగా ఎంతో బాధపడతా. ఏదైనా ప్రభుత్వసంస్థను ఎవరైనా బలహీనపర్చడానికి ప్రయతి్నస్తే కుంగిపోతా. అలాంటి ఈసీ స్వయంగా ఆరోపణల దాడులను ఎదుర్కొన్నప్పుడు వాటిని సమగ్ర దర్యాప్తు ద్వారా సమగ్రంగా ఎదుర్కోవాలి.
రాజకీయ శక్తులు, బయటి వ్యక్తుల ఒత్తిళ్ల ఏ స్థాయిలో ఉన్నా సరే స్వీయ నిర్ణయాలల్లో వెనుకడుగు వేయకూడదు. ప్రజల విశ్వాసాన్ని ఈసీ చూరగొనాలి. అధికార పారీ్టతో పోలిస్తే విపక్ష పార్టీల పలుకుబడి తక్కువ అయినాసరే విపక్ష పారీ్టల విశ్వాసాన్నీ సాధించాలి. అధికార పార్టీ నేతలతో పోలిస్తే విపక్ష పారీ్టల నేతలు చెప్పేవి ఎక్కువగా వినాలి. అందుకోసం వారికి ఈసీ తలుపులు బార్లా తెరవాలి. వాళ్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చి వాళ్ల వాదనలు, ఆరోపణలు, అభ్యంతరాలు, విన్నపాలను సావదానంగా ఆలకించాలి. మా మాట ఈసీ వినట్లేదని ముఖ్యమైన 23 పార్టీలు సుప్రీంకోర్టు గుమ్మం తొక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు’’అని ఈసీకి ఖురేషి హితవు పలికారు.
కొత్త జాబితాలో తప్పుల్లేవని అఫిడవిట్ ఇవ్వగలరా?
ఈ సందర్భంగా ఈసీపై ఖురేషి పలు ప్రశ్నలు సంధించారు.‘‘ముసాయిదా జాబితా తర్వాత సవరణల తర్వాత తెచ్చే తుది జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లవని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? రాహుల్‌ను అడిగినట్లుగా మీరు కూడా ఇందులో ఏ తప్పులు ఉండబోవని అఫిడవిట్ సమరి్పంచగలరా? తప్పులు ఉంటే అది నిజంగా నేరమే. అలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కోగలరా?. ఈసీ అనేది పారదర్శకంగా ఉంటే సరిపోదు. పారదర్శకంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించాలి. నిజానిజాలను దర్యాప్తు మాత్రమే బయటపెట్టగలదు. తీవ్ర ఆరోపణలు అరుదుగా చేస్తారు. అలాంటప్పుడే దర్యాప్తు చేపట్టాలి. అలాంటి అవకాశాన్ని ఈసీ సది్వనియోగం చేసుకోలేకపోయింది’’అని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ‘రాజకీయ పారీ్టలతో మేము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇంత నిర్మాణాత్మక పద్ధతిలో మరెక్కడా సమావేశాలు జరగవు’అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.