‘ట్రంప్‌ ఫోన్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపిన ప్రధాని మోదీ’ | Rahul Gandhi criticized PM Modi over operation sindoor | Sakshi
Sakshi News home page

‘ట్రంప్‌ ఫోన్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపిన ప్రధాని మోదీ’

Aug 27 2025 9:33 PM | Updated on Aug 27 2025 9:33 PM

Rahul Gandhi criticized PM Modi over operation sindoor

పాట్నా: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యానించారు. తన చొరవ లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉండేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆయన ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేయాలని సూచించారని, కాబట్టే ఆపరేషన్‌ సిందూర్‌ ఆగిందని ఆరోపించారు.

బీహార్‌ ముజాఫర్‌పూర్‌లో కాంగ్రెస్‌ ఓటర్‌ అధికార్‌ యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ జరిగే సమయంలో ట్రంప్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. వినండి.. మీరు ఏమి చేస్తున్నారో..అది 24 గంటల్లోపు ఆపండి’అని అన్నారు. అందుకు మోదీ ఆపరేషన్‌ సిందూర్‌ను ఐదుగంటల్లోనే ఆపేశారంటూ విమర్శలు గుప్పించారు.   కాగా,బీహార్‌లో  కాంగ్రెస్‌ తలపెట్టిన ఓటర్‌ అధికార్‌ యాత్ర కొనసాగుతోంది. బీహార్‌లో 1,300 కిలోమీటర్ల మేర సాగనుంది. 20కి పైగా జిల్లాలను కవర్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న పాట్నాలో ముగియనుంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement