శరద్ పవార్ ఇంట్లో జరిగిన విందులో రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
గ్లోబల్ సమ్మిట్ గురించి రాహుల్‌కు వివరించనున్న సీఎం
సోనియాను, కేంద్ర మంత్రులను కూడా కలిసే చాన్స్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈసారి పర్యటనలో ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీని కలుస్తారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. గ్లోబల్ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ హాజరు కాని నేపథ్యంలో, సమ్మిట్ జరిగిన తీరు గురించి సీఎం ఆయనకు వివరిస్తారని సమాచారం.
గురువారం పార్లమెంటుకు వెళ్లి వీలును బట్టి కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలుస్తోంది. సోనియా గాందీని కలిసి జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తారని, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె. సి.వేణుగోపాల్‌తో సమావేశమై పార్టీ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.
శరద్ పవార్ విందులో రేవంత్, రాహుల్ భేటీ
ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 12న శరద్ పవార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు.
ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ తోపాటు, మధుయాష్కీ గౌడ్ ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు..కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.


