గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా మోదీ, రాహుల్‌కు ఆహ్వానం పలకనున్న సీఎం
ఉదయం కొత్తగూడెంలో బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నా రు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తి రిగి వస్తారు.
రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తా రని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాందీలను కలుస్తారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు హాజరు కావాల్సిందిగా ఆహా్వనిస్తారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పలుకుతారు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి హుస్నాబాద్‌లో జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి.


