మెస్సీ, రేవంత్ టీంల ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు రాక
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శని వారం హైదరాబాద్‌కి వస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా మెస్సీ వర్సెస్ రేవంత్ టీంల ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు రాహుల్ రానున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం రాత్రి ఆయన ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు.
రాహుల్ టూర్ ఇలా!
కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయ ల్దేరనున్న రాహుల్ గాంధీ సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్తారు.
అక్కడ రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ రాత్రి 7:15 గంటలకు బయల్దేరి 7:55 నిమిషాలకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంకు చేరుకుంటారు. మెస్సీ టీంతో రేవంత్ టీం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షిస్తారు. ఆ తర్వాత రాత్రి 9:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరుతారు. 10:30 గంటలకు ఎయిరిండియా విమానంలో ఢిల్లీ వెళ్తారు.


