థిన్ లోన్, రిష్నా లోన్, అంబాలా క్యాష్ పేరిట ఫేక్ యాప్‌లు
వెల్లడించిన ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్)
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ భద్రత పరంగా సురక్షితంగా భావించే ఐ–ఫోన్లకు ఫేక్‌లోన్ యాప్‌ల బెడద తప్పడం లేదు. ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగానే యాపిల్ యాప్ స్టోర్‌లో ఇటీవల మూడు ఫేక్ లోన్ యాప్‌లను గుర్తించినట్టు కేంద్ర హోంశాఖకు చెందిన ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్) వెల్లడించింది. థిన్‌లోన్, రిష్నాలోన్, అంబాలా క్యాష్ అనేవి నకిలీ యాప్‌లు అని తెలిపింది.
ఈ యాప్‌లను గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించింది. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారం దొంగిలించి ఆ తర్వాత ఆన్‌లైన్ బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డాక్యు మెంట్లు లేకుండా లోన్లు ఇస్తామని ఊదరగొట్టే ఈ యాప్‌లను నమ్మి మోసపోవద్దని తెలిపింది. అనుమానాస్పద యాప్‌లకు సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 1930లో లేదా cybercrime. gov. in లో ఫిర్యాదు చేయా లని అధికారులు సూచించారు.


