రాయ్‌బరేలి: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరుదైన అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలోని తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఒక అభిమాని కుటుంబం రాహుల్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అపురూప జ్ఞాపకాన్ని తిరిగి పొందడంపై రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన రాహుల్ వెంటనే దాని ఫోటోను తన తల్లి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో వాట్సాప్‌లో షేర్ చేశారు. దీనికి సంబంధించి, అంకిత్ మయాంక్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రాహుల్ గాంధీ తాత, దశాబ్దాల క్రితం రాయ్‌బరేలీ మాజీ ఎంపీ ఫిరోజ్ గాంధీ పోగొట్టుకున్న పర్సును అక్కడి ఒక కుటుంబం ఇన్నాళ్లూ ఆయన జ్ఞాపకార్థం భద్రంగా దాచిందట. తాజాగా రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న ఆయన మనవడు, ఎంపీ రాహుల్ గాంధీని కలిసి ఆ పర్సును అందజేయడం విశేషంగా నిలిచింది.
స్థానిక కుటుంబం దశాబ్దాలుగా భద్రపరిచిన ఈ లైసెన్స్‌ను, రాయ్ బరేలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహక కమిటీ సభ్యుడు వికాస్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు తన నియోజకవర్గంలో పర్యటన రెండో రోజున గాంధీకి అందజేశారు.

వారు ఏమన్నారంటే.. "చాలా ఏళ్ల క్రితం, రాయ్‌బరేలిలో జరిగిన ఒక కార్యక్రమంలో, నా మామగారు ఈ డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. అప్పటినుంచీ ఆయన దానిని భద్రంగా ఉంచుకున్నారు. ఆయన మరణం తర్వాత, నా అత్తగారు దానిని భద్రపరిచారు" అని సింగ్ అన్నారు. "రాహుల్ గాంధీ రాయ్‌బరేలిని సందర్శిస్తు న్నారని తెలిసి దానిని అతనికి అందజేయడం మా బాధ్యతగా భావించాము." దీన్ని తమ కుటుంబం ఒక "అమానత్" (విలువైన ట్రస్ట్)గా దీన్ని గాంధీ కుటుంబానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించామని సింగ్ అన్నారు.
కాగా భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరా ప్రియదర్శిని గాంధీ, ఇందిరా గాంధీగా సుపరిచితులు. ఆమె ఈ దేశానికి మూడవ ప్రధానమంత్రి మరియు భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి కూడా. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ,కమలా నెహ్రూల కుమార్తె ఇందిరా గాంధీ,ఫిరోజ్ గాంధీ 1942 మార్చి 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కొడుకులే దివంగతులు రాజీవ్ గాంధీ, సంజీవ్ గాంధీ. డిసెంబర్ 1912లో జన్మించిన ఫిరోజ్ గాంధీ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాయ్ బరేలి సీటును గెలుచుకున్నారు. 1960 సెప్టెంబర్ 7న గుండెపోటుతో ఫిరోజ్ గాంధీ మరణించారు.

Rahul Gandhi’s grandfather Feroze Gandhi, who was also Raebareli MP, had lost his wallet many decades ago
One family in Raebareli kept it safe all these years as his memory
Today they returned his wallet to his grandson Rahul Gandhi
Beautiful moment ❤️pic.twitter.com/SVVCi1pckR— Ankit Mayank (@mr_mayank) January 20, 2026


