‘ఇప్పుడు సఫారీనా?’.. రాహుల్‌పై బీజేపీ విమర్శలు | BJP mocks Rahul Gandhis jungle safari in Pachmarhi | Sakshi
Sakshi News home page

‘ఇప్పుడు సఫారీనా?’.. రాహుల్‌పై బీజేపీ విమర్శలు

Nov 9 2025 1:42 PM | Updated on Nov 9 2025 3:26 PM

BJP mocks Rahul Gandhis jungle safari in Pachmarhi

న్యూఢిల్లీ: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల అంశం దేశంలో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. ఈ నేపధ్యంలో నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎంతో ఉల్లాసంగా మధ్యప్రదేశ్‌లో జంగిల్ సఫారీకి వెళ్లడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు గుప్పించింది.
 

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలకమైన ఎన్నికల దశలో రాజకీయ వాస్తవికతకు దూరమయ్యారని, ఆయనలో సీరియస్ నెస్ లోపించిందిన బీజేపీ ఆరోపించింది.‘ఎక్స్‌’ పోస్ట్‌లో బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా స్పందిస్తూ, ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ)రాహుల్‌ గాంధీ పర్యాటక నేతగా మారి, పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బీహార్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాహుల్ గాంధీ హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారని. బీహార్‌లో ఎన్నికలు జరుగుతుండగా రాహుల్ గాంధీ పచ్‌మరిలో జంగల్ సఫారీని ఆస్వాదించారని, ఇది ఆయన ప్రాధాన్యతలను తెలియజేస్తుందని’ ఆరోపించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు వారు భారత ఎన్నికల సంఘాన్ని నిందిస్తారని , హెచ్‌ ఫైల్స్‌ అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తారని షెహజాద్ పూనవాలా దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్‌ వారు జీవితమంతా ఇదే తప్పు చేస్తారని, వారి ముఖం మీద దుమ్ము ఉన్నప్పటికీ, వారు అద్దం శుభ్రం చేస్తూనే ఉంటారని ఆయన ఒక సామెతను ఉదహరించారు. కాగా శనివారం మధ్యప్రదేశ్‌ చేరుకున్న రాహుల్‌ గాంధీ ఆదివారం  ఉదయం జంగిల్ సఫారీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మరోమారు ఓటు చోరీ గురించి మాట్లాడారు. 

 ఇది కూడా చదవండి:  ‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement