బులెట్‌ బైక్‌ను కిలోమీటర్‌ లాక్కెళ్లిన కారు.. | Drunk SUV Driver Drags Bullet Bike For 500 Meters In Bengaluru, Watch Video Inside | Sakshi
Sakshi News home page

బులెట్‌ బైక్‌ను కిలోమీటర్‌ లాక్కెళ్లిన కారు..

Dec 27 2025 10:22 AM | Updated on Dec 27 2025 11:00 AM

Drunk SUV Drags Bullet Bike 500m in Bengaluru

యశవంతపుర: అచ్చం సినిమా స్టైల్‌లో ఈ ఘటన జరిగింది. కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న కారు.. ముందు వెళుతున్న బులెట్‌ బైక్‌ను ఢీకొని అర్ధ కిలోమీటర్‌  వరకు లాక్కెళ్లిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. సుమనహళ్లి వంతెనపై బుధవారం రాత్రి జరిగిన ఘటన వీడియో ఆలస్యంగా వైరల్‌ అయ్యింది. 

కారులోని వ్యక్తి ఇస్టానుసారం నడుపుతూ బులెట్‌ బైకును లాక్కొని వెళ్లాడు. నీ కారుకు బైక్‌ చిక్కుకుందని పక్కలో వెళ్లతున్న మరో కారు డ్రైవర్‌ హెచ్చరించినా పట్టించుకోలేదు. బుల్లెట్‌వాహనదారు రోహిత్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ రభసకు కారు కింద నిప్పురవ్వుల ఎగజిమ్మాయి, మంటలు వ్యాపించటంతో ఇతర వాహనదారులు భయపడ్డారు. నాయండహళ్లి జంక్షన్‌ వద్ద కొందరు ఆ కారును అడ్డుకొని పోలీసులకు పట్టించారు. డ్రైవర్‌ తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. తాగిన మత్తులో ఉన్నాడని తెలిసింది. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు
దొడ్డబళ్లాపురం: గత నాలుగు రోజుల్లో బెంగళూరులో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన ట్రాఫిక్‌ పోలీసులు 1,784 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసారు. 1,27,938 వాహనాలు తనిఖీ చేయగా మద్యం తాగి నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement