బెంగళూరు: మద్యం మత్తులో కారు డ్రైవరుపై యువతులు హెల్మెట్‌తో దాడికి పాల్పడి వీరంగం సృష్టించిన ఘటన హుళిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి 10 గంటలప్పుడు జరిగింది. స్నేహితులతో కలిసి హోటల్‌కు భోజనానికి వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన లీసా, మ్యాథ్యూ అనే ఇద్దరు యువతులు వీవీ రోడ్డు దోసె క్యాంప్ వద్ద స్కూటర్‌లో వెళ్తూ ముందున్న కారును ఢీకొట్టారు.
ఈ సమయంలో కారు డ్రైవరు అహ్మద్ కారు దెబ్బతినిందని, రిపేరు చేయించాలని వారిని నిలదీశాడు. మత్తులో ఉన్న యువతులు తప్పు నీదే అని అతనితో వాదించి నోటికొచ్చినట్లు దూషించి హెల్మెట్‌తో కొట్టారు. స్థానికులు యువతులను సముదాయించినా రభస సృష్టించారు. జనం హుళిమావు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని యువతులను, స్కూటర్‌ను ఠాణాకు తరలించారు. అక్కడ విచారించి మందలించి నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు.


