వైద్యనాథేశ్వర రథోత్సవం
భక్తజనం మధ్య తేరు ఉత్సవం
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని వైద్యనాథపురలోని పురాణ ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ స్వామి బ్రహ్మరథోత్సవాన్ని ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, వైద్యనాథస్వామి, ప్రసన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు జరిపి శుభ మీన లగ్నంలో తేరులో ప్రతిష్టించారు. తహశీల్దార్ పరశురామ్ సత్తిగేరి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో వందలాది భక్తులు శివనామ స్మరణతో తేరును లాగారు.


