
న్యూఢిల్లీ: రాబోయే 38 రోజుల్లో దేశంలోని అందరి దృష్టి బీహార్‌పైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్‌లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్‌లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.
ఆపరేషన్ సిందూర్, జీఎస్‌టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్‌లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్‌కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్‌లలో 100 శాతం వెబ్‌కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్‌లను బూత్‌కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.
పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్‌లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్‌లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్‌ను అప్‌డేట్ చేస్తారు.
ఎవరి సంగతి ఏమిటి?
నితీష్ కుమార్.. రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం.
తేజస్వి యాదవ్.. 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు మరో అవకాశం.
రాహుల్ గాంధీ .. తన ఓటు చోరీ నినాదానికి ప్రజల ఆమోదం పొందే ఛాన్స్
ప్రశాంత్ కిషోర్.. ఓట్లు చీలుస్తారా? కింగ్ మేకర్ అవుతారా? అనేది తేలనుంది.
చిరాగ్ పాస్వాన్.. బీహార్‌లో తన పార్టీ ఉనికిని బలోపేతం చేసేందుకు అవకాశం.
ఒవైసీ.. అనుకున్న స్థాయిలో ముస్లిం ఓట్లను పొందగలరా? అనేది తేలనుంది.
నితీష్‌కు నిజమైన పరీక్ష
ఫలితాల సమయంలో అందరి దృష్టి నితీష్ కుమార్ పైనే ఉండనుంది. తేజస్వి యాదవ్ తరచూ నితీష్ కుమార్ ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
లాలూ కుటుంబంలో అంతర్గత పోరు
లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అతని సోదరి రోహిణి ఆచార్య తన సోదరునిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
మహిళల చేతుల్లో ఫలితాలు?
బీహార్ ఎన్నికల ఫలితాలను మహిళలే నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మహిళల ఖాతాలలో నితీష్ కుమార్ ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున జమచేశారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 అందించాలనే ప్రతిపక్షాల ప్రయత్నాన్న ఇది గండికొట్టనున్నదని పలువురు అంటున్నారు. ఇన్ని అంశాల మధ్య రాబోయే 11 రోజులు బీహార్‌కు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అక్టోబర్ 17 మొదటి దశ నామినేషన్లకు చివరి తేదీ. ఈ లోపునే, సీట్ల కేటాయింపు, పార్టీల సమీకరణలు స్పష్టం కానున్నాయి.