పాట్నా: బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలని కోరుకుంటున్నాను. రెండు దశాబ్దాలుగా నాపై నమ్మకం ఉంచారు. అంకితభావంతో బీహార్ అభివృద్ధి కోసం పనిచేశారు’ అని పేర్కొన్నారు.
గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై చూపిన విశ్వాసం, మద్దతుతోనే నేను బిహార్ రాష్ట్రానికి, మీ అందరికీ పూర్తి నిబద్ధతతో సేవ చేయగలిగాము. మీ విశ్వాసం, మద్దతు వల్లే బిహార్ ఈరోజు అభివృద్ధి, గౌరవానికి కొత్త దిశను చూపుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,ఎంపీగా పనిచేశాను. రాజ్యసభ సభ్యుడిగా పనిచేయాలనేది నా చిరకాల కోరిక.
అందుకే రాబోయే ఎన్నికల్లో నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాలని అనుకుంటున్నా. మీతో నా సంబంధం కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన బీహార్ కోసం నేను కృషి చేస్తూనే ఉంటా. నేను మీకు హామీ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు, మార్గదర్శకత్వం లభిస్తుంది.
पिछले दो दशक से भी अधिक समय से आपने अपना विश्वास एवं समर्थन मेरे साथ लगातार बनाए रखा है, तथा उसी के बल पर हमने बिहार की और आप सब लोगों की पूरी निष्ठा से सेवा की है। आपके विश्वास और समर्थन की ही ताकत थी कि बिहार आज विकास और सम्मान का नया आयाम प्रस्तुत कर रहा है। इसके लिए पूर्व में…
— Nitish Kumar (@NitishKumar) March 5, 2026


