
రాహుల్ సమక్షంలోనే తేజస్వి వ్యాఖ్యలు
ఆరా(బిహార్): బిహార్‌లో మహాఘఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనంటూ ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించుకున్నారు. శనివారం ఆరా జిల్లాలో ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. బిహార్ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.
ఆరా ర్యాలీలో తేజస్వీ మాట్లాడుతూ..తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల్నే సీఎం నితీశ్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ముందు నేను వెళ్తుంటే ప్రభుత్వం వెనుక వస్తోంది. కాపీ కొట్టే సీఎం కావాలా? ఒరిజినల్ సీఎం కావాలా?’అంటూ ప్రజలను ప్రశ్నించారు. మహాఘఠ్ బంధన్ తరఫున అసలైన సీఎం అభ్యర్థి తానేనంటూ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో తేజస్వి...కాంగ్రెస్ జాతీయ పారీ్టయే అయినప్పటికీ బిహార్‌లో ఆర్‌జేడీ పెద్దన్న అని, తమదే పైచేయి అన్న అర్థంలో మాట్లాడారు.