
రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ జరుగుతోందని, ఓట్ల దొంగలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఖండించింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని, రాహుల్ నిరాధార ఆరోపణలు చేశారని తేలి్చచెప్పింది. ఆన్‌లైన్‌లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదని పేర్కొంది. ఎవరి ఓటునైనా తొలగించాలనుకుంటే వారి వాదన తప్పనిసరిగా వింటామని వెల్లడించింది.
సంప్రదించి అభిప్రాయం తెలుసుకోకుండా ఓటును తొలగించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. సామాన్య ప్రజలు ఆన్‌లైన్‌లో తమ ఓటును తొలగించుకోలేరని వివరణ ఇచి్చంది. రాహుల్ చెబుతున్నదాంట్లో నిజం లేదని తెలియజేసింది. 2023లో కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు కొందరు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదని పేర్కొంది. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.
అలంద్‌లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు గుర్తుచేసింది. అక్కడ ఓట్ల తొలగింపునకు జరిగిన ప్రయత్నాలకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని 2023 సెపె్టంబర్ 6న పోలీసులకు ఇచ్చామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓట్లు తొలగించాలంటూ వచి్చన దరఖాస్తులను పరిశీలించగా 24 మాత్రమే అసలైనవని, 5,994 తప్పుడు దరఖాస్తులేనని తేలినట్లు తెలిపింది. తప్పుడు దరఖాస్తులను తిరస్కరించామని, ఓట్లను తొలగించలేదని పేర్కొంది.