తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తుందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు ద్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ కేవలం 18 నెలల కాలంలోనే రూ.2.70లక్షల కోట్ల అప్పులు చేసిందని, సరాసరిన రోజుకు రూ. 550 కోట్లు అప్పు ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు (శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చన్నారు.
ఇటీవల జరిపిన ఒక గంట యోగా కార్యక్రమం కోసం రూ. 330 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో ఇదివరకే రూ.వేల కోట్లు దుబారా చేయగా ఇప్పుడు మళ్లీ వేల కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేవేటీకరణను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని జనమంతా ఆగ్రహంతో ఉన్నారని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని జనానికి అర్థం అయిందని తెలిపారు.అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతాకాలు చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం దాగి ఉందని మాజీ మంత్రి అప్పల్రాజు పేర్కొన్నారు.
భూమి ప్రభుత్వానిది ఆదాయం మాత్రం ప్రైవేట్‌వారికా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రెండేళ్ల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలా ఆ జీతాల సొమ్ముతో మరో రెండు వెద్యకళాశాలలు కట్టవచ్చని తెలిపారు.108, 104లను అనర్హులకు కట్టబెట్టిన వైనంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చూశారని తెలిపారు..
అందుకోసమే కరోనా సమయంలోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు వైద్యం అందకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ప్రైవేటీకరణను రద్దు చేసి తీరాతం అని మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు తెేల్చిచేప్పారు.

రాష్ట్రంలో చంద్రబాబు రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.. పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని పరిశ్రమలపై దాడులు చేసి మూసివేసేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం లేదని తెలిపారు. సనాతనవాదని అని గొప్పలు చెప్పుకుతిరిగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోమాంసం దొరికితే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
పరకామణి విషయంలో కోర్టు పరిధిలో సెటిల్మెంట్ జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయటం ఆయన సంకుచిత బుద్దికి నిదర్శనమని తెలిపారు.


