తాడేపల్లి : 35 రోజుల పాటు వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ,వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షలు, జిల్లా ప్రధాన కార్యదర్శలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.
‘ రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ కమిటీలు పూర్తవ్వాలి. అప్పుడు పార్టీకి 16 నుంచి 18 లక్షల సైన్యం రెడీ అవుతుంది. కమిటీల నిర్మాణం పూర్తికాగానే ఐడీ కార్డులు ఇస్తాం. కమిటీలలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్సాహంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి. కార్యకర్తల కష్టంతోనే కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ అయింది’ అని స్పష్టం చేశారు.


