సాక్షి,అమరావతి: ఇంటర్మీడియట్ బోర్టు 2026 ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియల్ తొలి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు బోర్టు ప్రకటించింది. రెండవ సంవత్సరం ఎగ్జామ్స్ ఫిబ్రవరి 24 నుంచి మెుదలు కానున్నట్లు పేర్కొంది. పరీక్షలు ఉ.9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ జరగనున్నాయి.
మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2ఏ మార్చి 21న.. మార్చి3న జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ పేపర్ 2లను మార్చి 4వతేదీకి మారుస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించింది. మిగతా పరీక్షలలో ఏటువంటి మార్పులు లేనట్లు తెలిపింది.
ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్వూస్ పరీక్ష జనవరి 21వ తేదీన ఉండగా, ఇన్విరాల్‌మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీన జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షల అనంతరం హాల్‌టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు బోర్టు అధికారికంగా వెల్లడించింది.


