breaking news
scheduele
-
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,అమరావతి: ఇంటర్మీడియట్ బోర్టు 2026 ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియల్ తొలి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు బోర్టు ప్రకటించింది. రెండవ సంవత్సరం ఎగ్జామ్స్ ఫిబ్రవరి 24 నుంచి మెుదలు కానున్నట్లు పేర్కొంది. పరీక్షలు ఉ.9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ జరగనున్నాయి. మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2ఏ మార్చి 21న.. మార్చి3న జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ పేపర్ 2లను మార్చి 4వతేదీకి మారుస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించింది. మిగతా పరీక్షలలో ఏటువంటి మార్పులు లేనట్లు తెలిపింది.ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్వూస్ పరీక్ష జనవరి 21వ తేదీన ఉండగా, ఇన్విరాల్మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీన జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షల అనంతరం హాల్‌టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు బోర్టు అధికారికంగా వెల్లడించింది. -
CBSE: ఫిబ్రవరి 17(2026) నుంచి బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026లో జరగబోయే 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు తేదీలను ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 9 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయని తెలిపింది.సెప్టెంబర్ 24న బోర్డు అధికారిక వెబ్సైట్ cbse.gov.inలో బోర్డు పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీటిని తాత్కాలికమైనవిగా గమనించాలని సీబీఎస్ఈ తెలియజేసింది. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు తమ అధ్యయనాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ తాత్కాలిక షెడ్యూల్ దోహదపడుతుందని బోర్డు తెలిపింది. ప్రతి పరీక్ష నిర్వహించిన 10 రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని పేర్కొంది. సీబీఎస్ఈ (CBSE) తెలిపిన వివరాల ప్రకారం 2026లో దాదాపు 45 లక్షల మంది అభ్యర్థులు 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరుకానున్నారు. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 18వరోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననాయకుడికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. నుదిటిపై గాయం మానకపోయినా.. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం జగన్ తన బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
114వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
114వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, గుంటూరు : ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 114వ రోజు షెడ్యూల్‌ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం వల్లభరావుపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి పెద్దపాలెం, తెలగాయపాలెం, బండ్లవారిపాలెం మీదుగా గరికపాడుకు చేరుకుంటారు. అనంతరం బీకే పాలెం మీదుగా కాకుమాన వరకు పాదయాత్ర కొనసాగనుంది. -
హజ్‌యాత్ర-2017 షెడ్యూలు విడుదల
హైదరాబాద్: హజ్‌యాత్ర-2017 షెడ్యూల్ ను రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఎ షుకూర్ శుక్రవారం విడుదల చేశారు. హజ్‌యాత్ర దరఖాస్తులను జనవరి రెండు నుంచి జారీ చేయడం జరుగుతుందన్నారు. జనవరి 24లోగా ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. మార్చి 1 నుంచి 8వ తేది మధ్య లక్కీ డ్రా ద్వారా యాత్రికుల ఎంపిక కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధులు మార్చి 31వరకు కాల పరిమతి గల అంతర్జాతీయ పాస్‌పోర్టు కలిగి ఉండాలన్నారు.


