
పాదయాత్రలో వైఎస్ జగన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, గుంటూరు : ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 114వ రోజు షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం వల్లభరావుపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి పెద్దపాలెం, తెలగాయపాలెం, బండ్లవారిపాలెం మీదుగా గరికపాడుకు చేరుకుంటారు. అనంతరం బీకే పాలెం మీదుగా కాకుమాన వరకు పాదయాత్ర కొనసాగనుంది.