ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు | IG Sunil Naik non-bailable warrant rejected | Sakshi
Sakshi News home page

ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు

Mar 2 2026 5:11 PM | Updated on Mar 2 2026 9:24 PM

IG Sunil Naik  non-bailable warrant rejected

బిహార్‌ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను పోలీసులు విత్‌డ్రా చేసుకున్నారు. సునీల్‌ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు స్పెషల్ మెుబైల్‌ కోర్టును పోలీసుల ఆశ్రయించారు.

దీంతో అరెస్ట్ చేసిన తర్వాత నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఏంటి అని అధికారులను ప్రశ్నించింది.  గుంటూరు స్పెషల్‌ కోర్టు. దీంతో కోర్టు ప్రశ్నలకు కంగుతిన్న పోలీసులు, లాయర్లు సునీల్‌ నాయక్‌ నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్‌డ్రా చేసుకున్నారు. 

కాగా అంతకు ముందు ఏపీ పోలీసు అధికారులు.. బిహార్‌ కేడర్‌ ఐజీ సునీల్‌ నాయక్‌ను అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో హంగామా చేశారు.  అయితే అక్కడ ఏపీ పోలీసులకు భంగపాటు తప్పలేదు. తమ  అధికారిని గోడదూకి ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ బిహార్‌ ప్రభుత్వం మండిపడింది. తమ రాష్ట్ర కేడర్‌కు చెందిన పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ గత శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

తమ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. కేంద్ర పోలీసు బలగాలకు చెందిన అధికారులకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బిహార్‌ ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు బిఎన్ఎస్  సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ  నోటిఫికేషన్ జారీ చేసింది.

దీంతో కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు  ప్రభుత్వ రక్షణ కల్పించనుంది. బిహార్‌ పోలీస్ అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలు నేపథ్యంలో  బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకార, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతిపై నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా కోర్టులు సైతం ఆయనకు నాన్‌ బెయిలబుల్ వారెంట్ తిరస్కరించింది.

Advertisement
 
Advertisement
Advertisement