హజ్‌యాత్ర-2017 షెడ్యూలు విడుదల | hazz committee releases scheduele for the trip | Sakshi
Sakshi News home page

హజ్‌యాత్ర-2017 షెడ్యూలు విడుదల

Dec 9 2016 7:31 PM | Updated on Sep 4 2018 5:07 PM

హజ్‌యాత్ర-2017 షెడ్యూల్ ను రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్‌ఎ షుకూర్ శుక్రవారం విడుదల చేశారు.

హైదరాబాద్: హజ్‌యాత్ర-2017 షెడ్యూల్ ను రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్‌ఎ షుకూర్ శుక్రవారం విడుదల చేశారు. హజ్‌యాత్ర దరఖాస్తులను జనవరి రెండు నుంచి జారీ చేయడం జరుగుతుందన్నారు. జనవరి 24లోగా ఆన్‌లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. మార్చి 1 నుంచి 8వ తేది మధ్య లక్కీ డ్రా ద్వారా యాత్రికుల ఎంపిక కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధులు మార్చి 31వరకు కాల పరిమతి గల అంతర్జాతీయ పాస్‌పోర్టు కలిగి ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement