
జేఈఈ మెయిన్స్-2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల నుంచి మొదటి సెషన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్-1 పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్-2కు జనవరి చివరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులు ముందుగానే తమ ఆధార్ కార్డులను తప్పులు లేకుండా అప్‌డేట్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ టెన్త్ సర్టిఫికెట్ ప్రకారం ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. షెడ్యూల్ పూర్తి వివరాల కోసం jeemain.nta.nic.in వెబ్ సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.