పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 (ICC Mens T20 World Cup) షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా ఫిబ్రవరి 7వ తేదీ ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ.. మార్చి 8వ తేదీ వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
భారత్‌లోని ఐదు వేదికల్లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలో మ్యాచ్‌లు జరగనున్నాయి. శ్రీలంక నుంచి మూడు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు భాగం కానున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, యూఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ తలపడనున్నాయి.
ఒక్కో గ్రూప్‌లో ఐదు టీంలుగా మొత్తం నాలుగు గ్రూపులు టోర్నీలో ఆడనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు టీంలు సూపర్ 8కి అర్హత సాధిస్తాయి. ఈసారి ఒకే గ్రూప్‌లో(గ్రూప్-ఏ) భారత్, పాక్ టీమ్‌లు ఉండనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్, నెదర్లాండ్, నమీబియా, అమెరికా ఉన్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన భారత్ అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది.
గ్లోబల్ ట్రోఫీ టూర్ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ Sanjog Gupta వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుందని ప్రకటించారు. ఒకవేళ పాక్ గనుక ఫైనల్‌కు చేరితే గనుక వేదిక మారనుందని ఐసీసీ స్పష్టత ఇచ్చింది.


