
న్యూఢ్లిలీ: దేశమంతటా దీపావళి వేడుకలు ఎంతో ఆనందంగా జరిగాయి. ఈ సందర్భంగా చాలామంది పరస్పరం స్వీట్లను పంచుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. దీపావళి వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుకు మరోమారు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక మిఠాయి దుకాణం యజమాని ఆ వివరాలు వెల్లడించారు.
దీపావళి వేళ ఓల్డ్ ఢిల్లీలోని ప్రముఖ ఘంటేవాలా స్వీట్స్ దుకాణానికి మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‌తో జరిగిన సంభాషణను యజమాని సుశాంత్ జైన్ మీడియాకు తెలిపారు. ముందుగా ఆయన రాహుల్ గాంధీని భారతదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అభివర్ణించారు. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, తనకు అతని వివాహ స్వీట్ల ఆర్డర్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దుకాణానికి ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబంతో అనుబంధం ఉందని, వారికి స్వీట్లు కావాల్సినప్పుడు తామే అందిస్తామని తెలిపారు.
पुरानी दिल्ली की मशहूर और ऐतिहासिक घंटेवाला मिठाइयों की दुकान पर इमरती और बेसन के लड्डू बनाने में हाथ आज़माया।
सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है - ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।
दीपावली की असली मिठास सिर्फ़ थाली में नहीं, बल्कि रिश्तों और समाज… pic.twitter.com/bVWwa2aetJ— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025
రాహుల్ తమ దుకాణానికి రాగానే తాను.. ‘రాహుల్ జీ.. దయచేసి త్వరలోనే పెళ్లి చేసుకోండి. మీ వివాహ స్వీట్ల ఆర్డర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని’ అన్నానని తెలిపారు. రాహుల్ తమ దుకాణంలోకి వచ్చిక అతని తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్‌ను గుర్తుచేసుకుంటూ, అతనికి ‘ఇమారి’ స్వీట్ ఇష్టమని చెప్పారన్నారు. అలాగే ఆయన దానిని తయారు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రాహుల్‌కు బేసన్ లడ్డూ ఇష్టమని తెలుసుకున్న తాను.. అతనితో దానిని కూడా తయారు చేసేందుకు కూడా ప్రయత్నించమని చెప్పానని సుశాంత్ జైన్ తెలిపారు.
దుకాణానికి వచ్చిన రాహుల్ అక్కడి సిబ్బంది ఆప్యాయంగా పలుకరించారు. పండుగను ఎలా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ‘పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ దుకాణంలో ఇమార్తి, బేసన్ లడ్డూలు తయారుచేశాను. ఈ షాపులోని శతాబ్దాల నాటి తీపిదనం ఇప్పటికీ మనసుకు హత్తుకునేలా ఉంది. అసలైన దీపావళి గొప్పదనం స్వీట్లలోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది" అని రాహుల్ రాశారు.