
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి కోపమొచ్చింది. ప్రశ్నించిన ఓ విలేకరిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నావ్?. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ట్రంప్ చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
తాజాగా వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ట్రంప్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఖతార్.. విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించిన విషయమై ట్రంప్‌ను ఎన్‌బీసీ ఛానెల్ విలేకరి ప్రశ్నించారు. సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఊగిపోయారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నువ్వు తెలివితక్కువ వాడివి. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి, ఖతార్ విమానానికి సంబంధం ఏంటి? వాళ్లు విమానం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షడు ట్రంప్‌కు ఖతార్ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జంజో జెట్ విమానాన్ని స్వీకరించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ విమానం ట్రంప్ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇక, దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు చేస్తున్నారు.
President Trump Slams NBC reporter 🔥 "GET OUT OF HERE"
You ought to go back to your studio at NBC because Brian Roberts and the people that run that place, they ought to be investigated. They are so terrible the way you run that network. And you're a disgrace. No more questions… pic.twitter.com/ezuE4vXstc— Steve Gruber (@stevegrubershow) May 21, 2025