హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్‌ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? | How Donald Trump Crackdown On Harvard Will Affect Indian Students | Sakshi
Sakshi News home page

హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్‌ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?

May 23 2025 10:31 AM | Updated on May 23 2025 12:16 PM

How Donald Trump Crackdown On Harvard Will Affect Indian Students

ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్‌  యూనివర్శిటీ  (Harvard University) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)  ప్రభుత్వం తీసుకున్న చర్య దిగ్భ్రాంతికి గురి చేసింది. హార్వర్డ్, ట్రంప్‌  సర్కార్‌కు మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే, ఫెడరల్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధికారాన్ని రద్దు చేసిది. హార్వర్డ్ దాని SEVP స్థితిని పునరుద్ధరించాలని భావిస్తే,  సంబంధిత పత్రాలను రూపొందించడానికి ఇతర డిమాండ్లను తీర్చడానికి 72 గంటల సమయం ఇచ్చింది.   ట్రంప్‌ తాజా సంచలన నిర్ణయం  అనేక మంది విదేశీ విద్యార్థులకు  దెబ్బతీయనుంది.ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. మరోవైపు ట్రంప్‌  నిర్ణయంపై హార్వర్డ్‌ యూనివర్శిటీ స్పందించింది.


ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్  ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది.  US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) గురువారం ప్రకటించిన ఈ నిర్ణయం, హార్వర్డ్‌లోని దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రమాదంలో పడేస్తుంది. వీరిలో భారతదేశం నుండి దాదాపు 800 మంది విద్యార్థులు  ఉండటం గమనార్హం. 

ఇదీ  చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్‌ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు

హార్వర్డ్ రికార్డుల ప్రకారం, ప్రతీ సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు మరియు స్కాలర్లు, వివిధ విభాగాలలో నమోదు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం, ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్‌లో చదువుతున్నారు, వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్-స్థాయి ప్రోగ్రామ్‌లలో ఉన్నారు. ట్రంప్ పరిపాలన చర్యతో, ఈ విద్యార్థులు ఇప్పుడు  అమెరికాలో చట్టబద్ధంగా ఉండాలనుకుంటే మరొక SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దు , బహిష్కరణకు దారి తీయవచ్చు.

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ (DHS) హార్వర్డ్‌పై జరుపుతోన్న విచారణలో భాగంగా తీసుకున్న చర్య అని  ప్రకటించింది.  ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను పంపించారు. ఈ లేఖలో, క్యాంపస్‌లోని విదేశీ విద్యార్థుల గురించి సమాచారం కోసం అమెరికా ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేకంగా, క్యాంపస్‌లో జరిగిన నిరసనలకు సంబంధించిన క్రమశిక్షణా రికార్డులు, ఆడియోవిజువల్ డాక్యుమెంటేషన్‌ను విశ్వవిద్యాలయం సమర్పించ లేదని లేఖలో ఆరోపించింది. 

అలాగే ‘హార్వర్డ్‌లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నాం. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదు.. అది ఓ అర్హత మాత్రమే” అని తెపారు. అంతేగాక, విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్లు నిధులు సమ కూర్చుకుంటున్నారు, ఇది హక్కు, కాదు’  అనిఆమె పేర్కొన్నారు.

మరోవైపు దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ కక్షపూరిత చర్యగా  అభివర్ణించింది. ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయం  చట్ట విరుద్ధమైందని వ్యాఖ్యానించింది. 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులకు ఆతిథ్యమిస్తూ ప్రపంచాన్ని వెలుగులో నింపేందుకు చేస్తున్న వారిని మా వర్సిటీలో కొనసాగించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


ఈ చర్య చట్టబద్ధమైనదేనా?
అమెరికా చట్టాల  ప్రకారం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విద్యార్థి వీసాలపై అధికార పరిధిని కలిగి ఉంటుంది. అలాగూ SEVPని పర్యవేక్షిస్తుంది. గతంలో నిష్ణాతులైన అధ్యాపకుల లేకపోవడం లేదా సంస్థను మూసివేయడం వంటి తీవ్రమైన పరిపాలనా లోపాలతో  SEVP జాబితా నుండి  కొన్నింటిని తొలగించినప్పటికీ, హార్వర్డ్  SEVP సర్టిఫికేషన్‌ను రద్దు చేయడం లాంటిది ఇంతకుముందెన్నడూ లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement