వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! | study warns thar Working 52+hours a week may physically change your brain | Sakshi
Sakshi News home page

వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!

May 22 2025 2:44 PM | Updated on May 22 2025 4:39 PM

 study warns thar Working 52+hours a week may physically change your brain

ఇటీవలి కాలంలో వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి?  అనేదానిపై తీవ్రంగా చర్చ నడిచింది. ఇన్ఫోసిస్‌ నారాయణ లాంటివాళ్లు ఎక్కువ పనిగంటలు,  అభివృద్ధిపై  చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.   ఈ విషయంలో తాజాగా జరిగిన ఒక పరిశోధన విస్తుపోయే అంశాలను వెల్లడించింది. వారానికి 52 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పనిచేసే వారిలో మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని పరిశోధకులు గుర్తించారు.ఆక్యుపేషనల్ & ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ (BMJ ప్రచురణ) జర్నల్‌లో ప్రచురించిన  ఈ అధ్యయనం అనేక అంశాలను  లేవనెత్తింది. అవేంటో చూద్దాం.

కరియర్‌కోసమో, ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలనే కాంక్షతోనో  మితిమీరి పనిచేస్తే  కొన్ని దుష్ర్బభావాలు తప్పని అధ్యయనం తేల్చి చెప్పింది. వారానికి 52 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల మెదడు పనితీరు దెబ్బ తింటుంది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి,  సమస్యలను పరిష్కరించే సామర్థ్యం,  మరియు భావోద్వేగ నియంత్రణలో తీవ్ర మార్పులులొస్తాయని కనుగొంది. 

విశ్రాంతిని పట్టించుకోకుండా,అతిగా పనిచేయడంవల్లశరీరంతోపాటు, మెదడుకు కూడా తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.  అంతేకాదు, మెదడు ఆకృతిలో కూడా మార్పులు సంభవిస్తున్నాయని తేల్చారు. ముఖ్యంగా కూర్చుని పనిచేసే వారి మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోతోందిట. ఇలాంటి వారిలో తీవ్రమైన డిప్రెషన్ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని  ప్రకటించింది. 

ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్‌ లుక్‌కి ఫిదా

యోన్సే విశ్వవిద్యాలయం, చుంగ్-ఆంగ్ విశ్వవిద్యాలయం , పుసాన్ నేషనల్ విశ్వవిద్యాలయం నుండి దక్షిణ కొరియా పరిశోధకుల బృందం నిర్వహించిన ఈ అధ్యయనం 110 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ స్టడీ చేసింది. ఇందుకోసం అధునాతన మెదడు ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించింది. అధిక పని చేసే వ్యక్తులు వారి మెదడుల్లో గుర్తించదగిన నిర్మాణాత్మక మార్పులను చూపించారని, అధిక పని చేసే వ్యక్తులు తరచుగా నివేదించే భావోద్వేగ , ఏకాగ్రత లేకపోవడం, అభిజ్ఞాన సమస్యలు తదితర మార్పులు ఉన్నాయని  గుర్తించారు.

 చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి


ఎక్కువ గంటల పని, మెదడు నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
పరిశోధకులు వారానికి 52 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే ఆరోగ్య కార్యకర్తలను తక్కువ గంటలు పనిచేసే వారితో పోల్చారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) ఆధారిత పద్ధతులు, వోక్సెల్-ఆధారిత మోర్ఫోమెట్రీ (VBM) ,అట్లాస్-ఆధారిత వాల్యూమ్ విశ్లేషణలను ఉపయోగించి, అధికంగా పని చేసే వ్యక్తులు కార్యనిర్వాహక పనితీరు (నిర్ణయం తీసుకోవడం , పని చేసే జ్ఞాపకశక్తి వంటివి)  భావోద్వేగ నియంత్రణలో తేడాలను గమనించారు. ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి ఎడమ మధ్య ఫ్రంటల్ గైరస్, ఇన్సులా,సుపీరియర్ ఫ్రంటల్ గైరస్, భావోద్వేగ సమతుల్యత మరియు సమస్య పరిష్కారంతో ముడిపడి ఉన్న మెదడు భాగాలో పెరుగుదలను గుర్తించారు. ఇది దీర్ఘకాలిక ఒత్తిడి ,అలసటకు కారణమైన న్యూరోఅడాప్టివ్‌కు  చిహ్నమని తెలిపారు.

ఎడమ కాడల్ మిడిల్ ఫ్రంటల్ గైరస్ అధిక పని చేసే సమూహంలో వాల్యూమ్‌లో 19 శాతం పెరుగుదలను చూపించింది. కార్యనిర్వాహక మరియు భావోద్వేగ విధులతో ముడిపడి ఉన్న 17 ఇతర మెదడు ప్రాంతాలలో కూడా గణనీయమైన వాల్యూమ్ పెరుగుదల కనిపించింది.ధూమపానం , వ్యాయామం వంటి గందరగోళ జీవనశైలి కారకాలకు సర్దుబాటు చేసిన తర్వాత కూడా ఈ మార్పులను గమనించారు. ఎక్కువ పని గంటల దుష్ప్రభావాలు మెదడు పనితీరును, ఆకృతిని దెబ్బతీయడంతోపాటు,  మానసిక  శారీరక ఆరోగ్యంపై  ప్రభావితం చేస్తుందని ఈ స్టడీ తేల్చింది.

చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్‌ఎస్‌ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్‌ సక్సెస్‌ స్టోరీ

అధ్యయనం చేసిన సిఫార్సులు
యజమానులు, విధాన రూపకర్తలు తక్షణ చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు అధ్యయనవేత్తలు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని,  వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలపై పరిష్కార  ప్రాముఖ్యతను నొక్కి  చెప్పాయి.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఇప్పటికే అధిక పని  మూలంగా ఏటా 8 లక్షలమంది చనిపోతున్నారని అంచనా వేసినందున, కొన్ని సూచనలు చేసింది. పని-జీవిత సమతుల్యత గురించి సంభాషణలో మెదడు ఆరోగ్యం ప్రాధాన్యతనివ్వాలి

యజమానులు మెరుగైన షిఫ్ట్ షెడ్యూల్‌లను రూపొందించాలి. విరామాలను ప్రోత్సహించా.లి మానసిక భారాన్ని తగ్గించడానికి వారపు గంటలను పరిమితం చేయాలి.కార్మికులు ఉద్యోగుల వారి మానసిక , భావోద్వేగ స్థితులను పర్యవేక్షించాలి. విశ్రాంతి .కోలుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి . బర్న్అవుట్ సంకేతాలు కనిపించినప్పుడు సహాయం తీసుకోవాలి.

అలాగే విధాన నిర్ణేతలు గరిష్ట పని గంటల చుట్టూ కఠినమైన మార్గదర్శకాలను నిర్దేశించాలి మరియు ఉద్యోగి శ్రేయస్సును కాపాడటానికి నిబంధనలను అమలు చేయాలి. కొన్నిసార్లు ఎక్కువ గంటలు అవసరమని అనిపించవచ్చు. కానీ  ఆ తరువాత ఊహింని విధంగా మెదడుకు జరిగే నష్టానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement