
అనాథ యువతికి వివాహం
పెళ్లి పెద్దగా వ్యవహరిస్తున్న
రామగుండం(కరీంనగర్): స్థానిక తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస ఆశ్రమం నుంచి అత్తారింటికి వెళ్లే సమయం సమీపిస్తోంది. పెళ్లి కూతురు ముఖంలో ఓ వైపు చిరునవ్వు, మరోవైపు ఆశ్రమ సంరక్షకులను, తోబుట్టువును విడిచి వెళ్తున్నాననే బాధ.. పెద్దపల్లి కలెక్టరేట్‌లోని దేవాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ వేడుక జరిపిస్తున్నారు. కాగా, 2021 మార్చి 15వ తేదీన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గుంజ విజయలక్ష్మి అనే యువతికి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారితో వీరేందర్‌నాయక్ వివాహం జరిపించగా, నక్క మానస వివాహం రెండోది.
16ఏళ్ల క్రితమే ఆశ్రమంలో చేరిన అక్కాచెల్లెలు..
సుమారు 16ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు నక్క మానస, నక్క లక్ష్మి సంరక్షణ కోసం ఇంటగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సరీ్వస్(ఐసీపీఎస్) అధికారులు స్పందించి రామగుండంలోని తబితా ఆశ్రమంలో చేరి్పంచారు. ఆనాటి నుంచి ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్‌నాయక్–విమల దంపతులు వారికి తల్లిదండ్రులుగా మారారు. నక్క మానస డిగ్రీ పూర్తి చేయగా, నక్క లక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది.
చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర..
ఆశ్రమంలో చేరిన సమయం నుంచి చదువులో, ఇంటిపనిలో చురుగా ఉంటోంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం తదితర గుణగణాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మానస. ఐదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసించగా ఆరు నుంచి పదో తరగతి వరకు మేడారం గురుకుల విద్యాలయంలో చదివి టెన్త్9.8 జీపీఏ, ఎల్లంపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ గ్రూపులో 895 మార్కులు, కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది.
ఎంత చెప్పినా తక్కువే
చిన్నప్పటి నుంచి అమ్మానాన్న విమల, వీరేందర్‌నాయక్ అని తెలుసు. కానీ ఓ ఆశ్రమంలో సంరక్షకులుగా మాత్రం నాకు తెలియదు. చిన్నప్పటికీ నా బాధ్యతలు, కష్ట సుఖాలు అన్నీ వారితోనే పంచుకునే దాన్ని. ఇప్పుడు నాకు ఓ వ్యాపారితో వివాహం చేస్తుండడంతో నేను ఇల్లాలిగా మారుతున్నా. అప్పుడు నా చెల్లి నక్క లక్ష్మి, నాతోటి మిత్రులు, నా అమ్మనాన్నలు (సంరక్షకులు)విడిచి వెళ్లలేక పోతున్నా. నా వివాహం కలెక్టర్ జరిపిస్తుండడం మరీ విశేషం.
– నక్క మానస, పెళ్లి కూతురు
ఆనందమో.. బాధో తెలియడం లేదు
పెళ్లీడుకొచ్చిన యువతికి వివాహం జరిపించడం నా కర్తవ్యం. అందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ఊహకందని విషయం. బాల్యం నుంచే మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసి కన్యాదానం చేయడం ద్వారా గుండెలు బరువెక్కుతున్నాయి. పెళ్లి కూతురు చెల్లి లక్ష్మి మరింత ఆవేదనకు లోనవుతుంది. ఆశ్రమంలో పెద్ద మనిగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే కూతురు నక్క మానస. భవిష్యత్తులో ఆమె కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– వీరేందర్‌నాయక్, తబితా ఆశ్రమ నిర్వాహకుడు
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు