ఎథ్నిక్‌ వేర్‌కు పెరుగుతున్న ఆదరణ, భారీ సేల్స్‌ | Flipkart Fashion Ethnic Wear Category Crosses 6 Million Shoppers In 1 Year | Sakshi
Sakshi News home page

ఎథ్నిక్‌ వేర్‌కు పెరుగుతున్న ఆదరణ, భారీ సేల్స్‌

May 22 2025 12:50 PM | Updated on May 22 2025 1:26 PM

Flipkart Fashion Ethnic Wear Category Crosses 6 Million Shoppers In 1 Year

స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్  ఫ్లిప్‌కార్ట్  (Flipkart)  ఫ్యాషన్‌  విభాగంలో   ఎథ్నిక్ వేర్  (Ethnic Wear) కేటగిరీలో భారీ సేల్స్‌ను సాధించింది. ఒక్క ఏడాదిలో  60 లక్షలమంది కొనుగోదారులను తనఖాతాలో వేసుకుంది.  అలాగే 90 శాతం  రిపీటెడ్‌ కస్టమర్లు ఉన్నారని ఫిప్‌కార్ట్‌  ప్రకటించింది. టైర్ 2 , టైర్ 3 నగరాల నుండి బలమైన డిమాండ్ ఉందని  తెలిపింది. 

సాంప్రదాయ దుస్తుల  కొనుగోలుదారుల్లో  25–35  వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం  మొత్తం దుకాణదారుల పరిమాణంలో 55 శాతం తమదే అని తెలిపింది. వాటా కలిగి ఉంది.ఇది తమ కస్టమర్‌విశ్వాసం, విధేయతను నిదర్శనమని,  అలాగే ఈ పెరుగుదల డిజిటల్ స్వీకరణను మాత్రమే కాకుండా యువ భారతీయ వినియోగదారులలో అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ప్రాధాన్యతలను కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, పాట్నా, లక్నో, చెన్నై, పూణే, ముంబై , గౌహతి వంటి నగరాలు  కీలకమైన డిమాండ్ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. మహిళల విభాగంలో 65శాతం కొనుగోళ్లు మహిళా దుకాణదారులుండగా, అయితే పురుషుల స్తులలో, 88శాతం లావాదేవీలు పురుషులే  షాపింగ్‌ చేస్తున్నారు.   భారతీయ దుస్తుల మార్కెట్‌లోని ప్రస్తుత ఫ్యాషన్ అనేది ప్రస్తుత పోకడలతో సాంప్రదాయ డిజైన్‌ల కలయిక, ఫ్యాషన్ వినియోగదారులను ఆకర్షించే ఇండో-వెస్ట్రన్ దుస్తులు మిళితంగా ఉన్నాయని  ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ గుప్తా తెలిపారు.

ఎథ్నిక్ వేర్ విభాగంలో, ముఖ్యంగా చీరలు , కుర్తాలలో గణనీయమైన వృద్ధిని చూస్తున్నామన్నారు. గత సంవత్సరం స్టైల్ ట్రెండ్స్ పరంగా, కుర్తాలు 42 శాతం డిమాండ్‌తో ముందంజలో ఉన్నాయి, ఆ తర్వాత చీరలు 24 శాతం , కుర్తీలు 18 శాతం పెరిగాయి. నిర్దిష్ట శైలులు విపరీతమైన వృద్ధిని సాధించాయి: గత సంవత్సరంతో పోలిస్తే మే 2025లో అనార్కలి సూట్లు 45రెట్టు, చికంకారి కుర్తాలు 40రెట్లు,  రెడీ-టు-వేర్ చీరలు 3రెట్లు పెరిగాయి. బ్లాక్‌  చీరలు లాంగ్ ఫ్రాక్‌ల కోసం  ఎక్కువ సెర్చ్‌ చేస్తున్నారు.  అలాగే ఈద్, దీపావళి , రక్షాబంధన్ సమయాల్లో కుర్తా సెట్‌లు గరిష్ట స్థాయికి చేరుకుంటుండగా, దుర్గా పూజ, ఓనం , పొంగల్ సమయాల్లో చీరలకు డిమాండ్  ఎక్కువ ఉంటుంది.

ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్‌ లుక్‌కి ఫిదా

ఇటీవలి నివేదికల ప్రకారం, 2024 నాటికి, భారతీయ ఎథ్నిక్ వేర్ మార్కెట్ విలువ సుమారు 197.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది  2033 నాటికి 558.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా.   ఆన్‌లైన్‌ షాపింగ్‌వృద్ధి  ఈ గ్రోత్‌కు దోహదం చేస్తోంది. 

చదవండి: ఇవాళ ఏ స్ట్రీట్‌ ఫుడ్‌ ట్రై చేయాలబ్బా? ఇపుడిదే ట్రెండ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement