breaking news
Residential area
-
జనావాసంలో కూలిన చిన్న విమానం
శాన్ డియాగో: అమెరికాలోని శాన్ డియాగో శివారులోని జనావాసాల మధ్య గురువారం తెల్లవారుజామున చిన్న విమానం ఒకటి కూలింది. ఈ ఘటనలో పలువురు మృత్యువాతపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన శకలాలతోపాటు ఇంధనం పారబోసినట్లు పడి మండటంతో 15 ఇళ్లలో మంటలు చెలరేగాయి. మరో డజను వరకు కార్లు కాలిపోయాయని అధికారులు తెలిపారు. జనావాసాలున్న చోట విమాన ప్రమాదం చోటుచేసుకుందన్నారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆస్పత్రిలో చేర్చామని, మరో ఇద్దరికి స్వల్పంగానే గాయాలయ్యాయన్నారు. కూలిన ప్రైవేట్ సెస్నా రకం విమానంలో 10 మంది వరకు ప్రయాణించే వీలుందని, ఘటన సమయంలో అందులో ఎందరున్నారనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. బుధవారం రాత్రి న్యూయార్క్ నగరంలోని టెటెర్»ొరో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకునన ఈ విమానం కన్సాస్ రాష్ట్రం విచిటాలోని కల్నల్ జేమ్స్ జబరా ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగింది. అనంతరం టేకాఫ్ తీసుకున్న ఈ విమానం శాన్ డియాగోలోని మాంట్గోమెరీ–గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్టులో ల్యాండవ్వాల్సి ఉందని సమాచారం. మరో మూడు మైళ్ల ప్రయాణం ఉందనగా ప్రమాదంలో చిక్కుకుందన్నారు. విమానం పైలట్ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు రాలేదని తెలిపారు. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సైనికుల నివాస ప్రాంతముందని చెప్పారు. కాగా, అలాస్కాలోని ఓ కంపెనీకి చెందిన ఈ విమానం 1985లో తయారైంది. సుమారు 4 గంటల సమయంలో దట్టంగా మంచుకురుస్తుండగా విమానం కరెంటు తీగలను తాకడం వల్ల ప్రమాదానికి గురైందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు వివరించారు. -
దక్షిణ కాలిఫోర్నియా.. ఇళ్లపైకి దూసుకెళ్లిన విమానం
శాన్‌డియాగో: దక్షిణ కాలిఫోర్నియాలో జనావాసాల్లోకి ఓ చిన్నపాటి విమానం దూసుకెళ్లింది. దీంతో 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్ల కూడా దెబ్బతిన్నాయి. భారీ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మృతుల వివరాలపై ఇప్పటి వరకు శాన్‌డియాగో పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా విమానం.. ఇళ్లలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. The Cessna 550 plane crashed in San Diego's Murphy Canyon neighbourhood around 3.47am during a period of dense fog.A huge fireball erupted after the crash, setting multiple homes and cars ablaze. At least 15 properties have been affected.https://t.co/QAxenqSOWk via @MailOnline pic.twitter.com/jN4dr6T4Es— Tamra M McDougall (@TamraMcDougall) May 22, 2025 -
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి ఊపందుకుంటోంది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో భూములు మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం 2024 మొదటి నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుస్తోంది.2024 ఏప్రిల్ వరకు జరిగిన 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్ల విలువ సుమారు రూ. 16,190 కోట్లు. 2023 మొదటి నాలుగు నెలలతో పోలిస్తే.. 2024 మొదటి నాలుగు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 15 శాతం ఎక్కువ. విలువ పరంగా 40 శాతం ఎక్కువని తెలుస్తోంది.2024లో ఎక్కువగా ఖరీదైన గృహాలకు రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.1 కోటి.. అంత కంటే ఎక్కువ ఖరీదైన గృహాలు ఉన్నాయి. ఖరీదైన గృహాల రిజిస్రేషన్స్ 2023 కంటే 2024లో 92 శాతం ఎక్కువ.రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్యలో ఉన్న గృహాల రిజిస్ట్రేషన్స్ 2023 కంటే 47 శాతం ఎక్కువని గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద అన్ని రకాల కేటగిరీల గృహాల రిజిస్ట్రేషన్, విలువ 2023 కంటే ఎక్కువగానే నమోదయ్యాయి.2024 ఏప్రిల్ నెలలో మొత్తం రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 6,578 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్య 2023 కంటే 46 శాతం పెరిగింది. ఈ ప్రాపర్టీల విలువ రూ.4,260 కోట్లగా నమోదైంది. ఇది కూడా అంతకు ముందు ఏడాది కంటే 86 శాతం పెరుగుదలను చూపుతోంది.హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ హైదరాబాద్‌లో మాత్రమే కాకూండా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా ఉంది. ఇవన్నీ ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లకు సంబంధించిన గృహ విక్రయాలను కవర్ చేస్తుంది. -
జనావాసాల్లోకి వచ్చిన మొసలి..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని దామో పట్టణంలో ఓ మొసలి జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు దామో పట్టణం సమీపంలోని నది ఉప్పొంగడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొసలి రాకతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని పట్టుకున్నారు. అనంతరం దానిని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై దామో ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ పర్మ్‌లాల్ మాట్లాడుతూ.. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతోనే మొసలి పట్టణంలోకి ప్రవేశించిందని తెలిపారు. అది 10 ఫీట్లకు పైగా పొడవు ఉందని.. స్థానికులు, తమ సిబ్బంది సాయంతో దానిని జాగ్రత్తగా పట్టుకున్నామని పేర్కొన్నారు. -
వైరల్ : జనావాసాల్లోకి చిరుతపులి.! బీభత్సం
ఇండోర్ : జనావాసాల్లోకి వచ్చి ఓ చిరుతపులి బీభత్సం సృష్టించింది. దీంతో జనాలు పరుగులు తీసారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇండోర్‌లోని పలహార్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలోకి చిరుతపులి వచ్చింది. దీన్ని గమనించిన కాలనీవాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే సజీవంగా పట్టుకునే క్రమంలో పులి వీధుల వెంబడి పరుగెడుతూ ముగ్గురిని గాయపరిచింది. ఒక్క ఇంటి నుంచి మరో ఇంటిపై దూకుతూ.. కాలనీవాసులు, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. చివరకు అటవీ అధికారులు మత్తు ఇంజెక్షన్ల సాయంతో సజీవంగా పట్టుకోని జూకు తరలించారు. -
జనవాసాల్లోకి చిరుతపులి.! బీభత్సం
-
విమాన ప్రమాదంలో 38 మంది మృతి
-
విమానం కుప్పకూలి.. 113 మంది మృతి!
ఇండోనేసియాలోని మెడాన్ నగరంలో గల నివాస ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రవాణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 113 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, కార్లు కూడా బూడిద కుప్పలుగా మారాయి. సహాయక బృందాలు పెద్ద ఎత్తున వెంటనే రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. తమవాళ్లకు ఏమయిందో అని చుట్టుపక్కల వాళ్లు ఆందోళనగా అక్కడ గుమిగూడారు. తాను అక్కడకు సమీపంలోనే ఉండే ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తానని, విమానం బాగా కింద నుంచి వెళ్తూ ఒక్కసారిగా కూలిపోవడాన్ని తన కిటికీలోంచి చూశానని నోవి అనే టీచర్ చెప్పారు. అది చాలా భయంకరంగా ఉందని ఆమె అన్నారు. ప్రమాద స్థలం వద్ద ఎక్కడ చూసినా పొగలు, శిథిలాలే కనపడుతున్నాయి. విమానంలో 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎవరైనా బతికారా లేదా అన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. వారిలో ముగ్గురు పైలట్లు, ఒక నేవిగేటర్, 8 మంది టెక్నీషియన్లు ఉన్నారు. ప్రమాదం జరిగే సమయానికి ఆ ప్రాంతంలోని భవనాల్లో ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలియట్లేదు. భవన శిథిలాల కింద చాలా మృతదేహాలు ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. విమానం బయల్దేరిన రెండు నిమిషాలకే అది కూలిపోయింది. మెడాన్లో ఈ దశాబ్దంలో ఇది రెండో విమాన ప్రమాదం. గతంలో 2005 సంవత్సరంలో మండలా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో కూలిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది, స్థానికులు సహా 150 మంది మరణించారు. -
వ్యభిచార గృహంపై స్థానికుల దాడి
నిర్వాహకులను, విటులను పోలీసులకు అప్పగించిన వైనం మదనపల్లె: నివాసప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై స్థానికులు దాడి చేశారు. నిర్వాహకులను, విటులను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నీరుగట్టువారిపల్లెలోని తారకా లేఅవుట్లో ఓ మహిళ ఒంటరిగా నివాసముంటోంది. కొంతమంది మహిళలను వ్యభిచారం ఉచ్చులోకి దించి వ్యాపారం సాగి స్తోంది. పలుమార్లు స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకపోగా వారిపై బెదిరింపులకు పాల్పడేది. స్థానికంగా నివాసముంటున్న మహిళలు తీవ్ర ఇబ్బందిపడేవారు. ఇకచేసేది లేక కౌన్సిలర్ బండి నాగరాజు ఆధ్వర్యంలో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో సహా విటులను, మహిళలను రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై టూ టౌన్ ఎస్ఐ హనుమంతప్పను వివరణ కోరగా, వ్యభిచారవృత్తిలో ఉన్న ముగ్గు రు మహిళలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని చెప్పారు.