
వ్యక్తిపై దాడి చేస్తున్న చిరుత పులి
ఇండోర్ : జనావాసాల్లోకి వచ్చి ఓ చిరుతపులి బీభత్సం సృష్టించింది. దీంతో జనాలు పరుగులు తీసారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇండోర్‌లోని పలహార్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలోకి చిరుతపులి వచ్చింది. దీన్ని గమనించిన కాలనీవాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే సజీవంగా పట్టుకునే క్రమంలో పులి వీధుల వెంబడి పరుగెడుతూ ముగ్గురిని గాయపరిచింది. ఒక్క ఇంటి నుంచి మరో ఇంటిపై దూకుతూ.. కాలనీవాసులు, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. చివరకు అటవీ అధికారులు మత్తు ఇంజెక్షన్‌ల సాయంతో సజీవంగా పట్టుకోని జూకు తరలించారు.