
సాక్షి,విశాఖ: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ కొంకణ్, గోవా ఆనుకుని ఈస్ట్ అరేబియా సముద్రంపై అల్పపిడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించింది. దాని ప్రభావంతో దాని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పడే ప్రాంతంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా..ఇవాళ, రేపు ఈ రెండు రోజుల పాటు వాతవరణ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
గడచిన 24 గంటల్లో.. అమరావతి 9, పొదిలి 7, మాచర్ల 6, విశాఖ, మచిలీపట్నం, జంగ మహేశ్వరపురం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
