మూగ జీవే..కానీ ఎంత అద్బుతంగా వీడ్కోలు చెప్పింది..! | Retiring Kerala firefighter Shares emotional farewell with loyal station dog | Sakshi
Sakshi News home page

మూగ జీవే..కానీ ఎంత అద్బుతంగా వీడ్కోలు చెప్పింది..!

May 22 2025 2:37 PM | Updated on May 22 2025 3:27 PM

Retiring Kerala firefighter Shares emotional farewell with loyal station dog

విశ్వాసానికి పేరుగాంచిన కుక్కలు మనుషులతో ఎంతో అద్భుతంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయో తెలిసిందే. తమ యజామాని పట్ల ఎంతలా విధేయతతో ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి మన మాటలు అర్థం కాకపోయినా..మనకేం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి. 

మూగజీవే అయినా..ఎంత అందంగా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదహారణే ఈ అగ్నిమాపక స్టేషన్‌లో జరిగిన ఘటనే. ఇది తన అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్‌ అవ్వుతుంటే..అది కూడా ఎంత అద్భుతంగా వీడ్కోలు చెప్పిందో చూస్తే..ఆశ్యర్యంగా అనిపిస్తుంది. 

ఈ ఘటన కేరళ అగ్నిమాపకదళ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఆ స్టేషన్‌లోని అగ్నిమాపక అధికారి షాజు పదవీవిరమణ చేస్తున్నరోజు కావడంతో..తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు చక్కగా వీడ్కోలు పలికారు.

 ఆ తర్వాత అదే స్టేషన్‌లో ఉండే రాజు అనే కుక్కకూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడ్కోలు చెబుతోంది. నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా..అది నిశబ్దంగా వీడ్కోలు చెప్పే తీరు అమోఘం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

 

(చదవండి: 'టాకింగ్ ట్రీ'..ఈ టెక్నాలజీతో నేరుగా మొక్కతో మాట్లాడేయొచ్చు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement