'టాకింగ్ ట్రీ'..నిజంగానే మొక్కతో మాట్లాడే టెక్నాలజీ..! | A Technology Project Gives Voice To 200-Year-Old London Plane Tree | Sakshi
Sakshi News home page

'టాకింగ్ ట్రీ'..ఈ టెక్నాలజీతో నేరుగా మొక్కతో మాట్లాడేయొచ్చు..!

May 22 2025 11:02 AM | Updated on May 22 2025 1:45 PM

A Technology Project Gives Voice To 200-Year-Old London Plane Tree

చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుకదాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా వాటితోనే మాట్లాడటం, పెళ్లి చేసుకోవడం వంటివి  చేసిన ఘటనలు చూశాం. అలాగే పరిశోధకులు చెట్టుకు ప్రాణం, ఉంది అవి కూడా స్పందిస్తాయని చెప్పారు. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్‌ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు. ఇప్పుడూ ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరచడమే కాదు..మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందాం..!.

ఐర్లాండ్‌ రాజధానిలలోని ట్రినిటి కాలేజ్‌లో  'టాకింగ్‌ ట్రీ' అనే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందిస్తారు. అందుకోసం పర్యావరణ సెన్సార్లు ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, తేమ, సూర్యకాంతి, గాలి నాణ్యత' తదితరాల ఆధారంగా 'బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్'ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్‌ని ఏఐ సాంకేతికత మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది. 

అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకుని కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. 

అంతేగాదండోయ్‌ తాము చెట్టుతో ఎలా సంభాషిస్తున్నామో వీడియో రూపంలో సవివరంగా చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్‌ ప్లేన్‌ ట్రీ వేర్లకు వైర్లకు టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడుతున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏవిధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో.

 

(చదవండి: డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌..! పార్కిన్‌సన్స్‌కు నృత్య చికిత్స)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement