108 అంతస్తులు భవనాన్ని ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌ | Small Plane Crash Beijing Tallest Building At China | Sakshi
Sakshi News home page

108 అంతస్తులు భవనాన్ని ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌

Jun 27 2026 7:44 AM | Updated on Jun 27 2026 9:03 AM

Small Plane Crash Beijing Tallest Building At China

బీజింగ్‌: చైనా రాజధాని బీజింగ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత ఎత్తైన సిటిక్ టవర్ (చైనా జున్) భవనాన్ని ఓ చిన్న విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో భవనం పైభాగం దెబ్బతినగా, గాజు ముక్కలు, విమాన శకలాలు కింద రోడ్డుపై పడటంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఫ్లైట్ ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైనది రెండు సీట్లతో కూడిన తేలికపాటి Sunward SA60L Aurora విమానంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటి? పైలట్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా ప్రాణనష్టం లేదా గాయాలు జరిగాయా? అనే అంశాలపై చైనా అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశాయి. భవనంలోని కొంతమందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, చైనాలో వాటి ప్రచారంపై ఆంక్షలు విధించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా.. చైనా రాజధాని బీజింగ్‌లోనే అతిపెద్దదైన ఈ భవనాన్ని ‘చైనా జున్‌’ (China Zun)గా పిలుస్తుంటారు. దీని ఎత్తు 528 మీటర్లు (1732 అడుగులు). పురాతన చైనీస్‌ వైన్‌ పాత్ర ఆకారంలో దీన్ని నిర్మించారు. ఈ భవనంలో 108 అంతస్తులు ఉన్నట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement