కూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం

Small Plane Crashes In Sweden Multiple Deceased - Sakshi

Sweden Plane Crash స్వీడన్‌లో చిన్నసైజు విమానం కూలిన దుర్ఘఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్‌ సహా ఎనిమిది మంది స్కై డైవర్లు ఉన్నట్లు సమాచారం. 

గురువారం స్టాక్‌హోంకి వంద మైళ్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్వీడన్‌ జాయింట్‌ రెస్క్యూ కో ఆర్టినేషన్‌ సెంటర్‌ ప్రతినిధులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. విమానం దిగే టైంలోనే ఘటన జరిగిందని భావిస్తున్నారు. 

కాగా, ఘటనపై దిగ్‌భ్రాంతి వ్యక్తం చేసిన స్వీడన్‌ ప్రభుత్వం.. బాధితుల కుటుంబాలను ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 2019లో ఇలాగే ఓ చిన్న విమానం స్కై డైవర్లతో వెళ్తుండగా.. ఈశాన్య స్వీడన్‌లోని ఉమేయాలో ఘోర ప్రమాదానికి గురైంది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top